RRR Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చెర్రీ తారక్ ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను విజువల్ ట్రీట్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే అభిమానులు అనుకుంటున్న విధంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీయడం అన్నది అంత తెలివైన విషయం కాదు. బాహుబలి సినిమా విషయానికి వస్తే ఆ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ముందే రివీల్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆర్ఆర్ఆర్ రెండు భాగాలుగా ఇస్తామని ఎప్పుడు రివీల్ చేయలేదు.కాబట్టి ఈ సినిమాకు మళ్లీ కొనసాగింపు సీక్వెల్ అంటే సాధ్యమయ్యే పనికాదు అని తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై రాజమౌళి ఇది వరకే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభిమానులు కోరికను మేకర్స్ అర్థం చేసుకోగలరు కానీ ఈ సినిమా సీక్వెల్ లో ఆశించవద్దు అని తెలిపారు రాజమౌళి.
