Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Big Boss Non stop: మొదటి వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్?

Big Boss Non stop: బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల పాటు ప్రసారమవుతుంది.17 మంది కంటెస్టెంట్ లతో ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక మొదటి వారం నామినేషన్ లో భాగంగా సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు.ఇక నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఈ వారం ఎవరు బయటికి వెళ్లనున్నారనే విషయం గురించి తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళేదనే విషయం మనకు ఒక రోజు ముందుగానే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానుందనే వార్త లీక్ కావడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లలో మిత్రశర్మ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గా బిగ్ బాస్ నుంచి బయటకు వస్తారని అందరూ భావించిన ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ నుంచి బయటకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొంత సమయం పాటు వేచి చూడాలి.

అయితే ముమైత్ ఖాన్ ఇదివరకే బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మొదటి సీజన్ లో ముమైత్ ఖాన్ ఏడు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అలాంటి ముమైత్ ఖాన్ ఈ సీజన్ లో మొదటి వారం ఎలిమినేట్ అవుతుందనే వార్త తెలియడంతో ప్రేక్షకులు ఎంతో ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవుతున్నారని చెప్పవచ్చు.

Advertisement
Exit mobile version