Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Lottery Winner: లాటరీ గెలిచానని అంతా అప్పులు అడుగుతున్నారు.. ప్లీజ్ రా అయ్యా నన్నొదిలేయండి!

Lottery Winner: అదృష్టం ఎవరిని ఏ రూపంలో వర్తిస్తుందో తెలియదు. ఒక్కరోజులో సామాన్యుడు ధనవంతుడు కావొచ్చు. కాగా ఇటీవల కేరళకు చెందిన ఆటో డ్రైవర్ అనూప్.. లాటరీలో 25 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు. ఈ క్రమంలో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఐదు రోజులు గడిచిన తర్వాత అనూహ్యంగా తనకు బహుమతి వద్దనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. కేరళ ప్రముథ పండుగ ఓనం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మెగా ఓనం రాఫిల్ లో ఆటో డ్రైవర్ అనూప్ ఆనందం వ్యక్తం చేశాడు. కానీ ఇంతలోనే ఆ డబ్బు వస్తున్న కారణంగా తాను మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపాడు.

అయితే లాటరీ డబ్బులో పన్ను, ఇతర బకాయిలు పోయిన తర్వాత ప్రైజ్ మనీగా 15 కోట్లు వచ్చే అవకాశం ఉంది. లాటరీ గెలిచాక 2 రోజులుగా ఆనందంగా గడిపాను కానీ ప్రస్తుతం మాత్రం మనశ్శాంతిని కోల్పోయానంటూ నిద్ర కూడా పట్టడం లేదని అన్నాడు. ఎందుకంటే నేను లాటరీ గెలిచాక నా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తన అవసరాలు తీర్చమంటూ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అందుకే ఇబ్బందులు పడుతున్నానన్నారు.

Advertisement
Advertisement
Exit mobile version