Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ గారి పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక ఎంపీగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను : మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

Kaikala Satyanarayana : ప్రముఖనటుడు మచిలీపట్నం మాజీ ఎంపీ నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు ప్రసుత్త మచిలీపట్నం యం.పి వల్లభనేని బాలశౌరి. సత్యనారాయణ గారి భౌతికకాయాన్ని సందర్శించటానికి మహాప్రస్థానానికి చేరుకుని నివాళులు అర్పించారు యంపి బాలశౌరి, టీటీడి బోర్డు సభ్యులు దాసరి కిరణ్‌కుమార్‌.

Kaikala Satyanarayana

నివాళి అనంతరం బాలశౌరి మాట్లాడుతూ–‘‘ సినిమా పరిశ్రమలో పౌరాణిక, జానపద, చారిత్రక, సంఘీక చిత్రాలు అనే తారతమ్యాలు లేకుండా దాదాపు ఆరు దశాబ్దాలుగా నటునిగా తన సేవలను అందించారు కైకాలగారు. గతంలో యస్వీ రంగారావు గారు ఉండేవారు. తర్వాత కైకాల సత్యనారాయణ గారు తన నటనతో ఆయనలేని లోటును భర్తీ చేశారు . దాదాపు 750 పైచిలుకు చిత్రాల్లో నటించిన నటులు చాలాతక్కువ మంది ఉన్నారు చిత్ర పరిశ్రమలో. పరిశ్రమలో కానీ, రాజకీయంగా కాని ఆయనకు మంచి వ్యక్తిగా ఎంతో పేరుంది. వ్యక్తిగతంగా నాకు పరిచయం ఆయన.

నిన్న ఆయన మృతిపట్ల చిరంజీవిగారు కూడా స్పందించి ఎంతో చక్కగా మట్లాడారు. వారికున్న అనుబంధం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన స్వగ్రామం కౌతవరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాలు నిర్మించటానికి సాయం చేస్తాను. గుడివాడలో కైకాల సత్యనారాయణ కళాక్షేత్రం అని ఉంది. ఆ కళాక్షేత్రాన్ని మరింతగా డెవలప్‌ చేసి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక పార్లమెంట్‌ సభ్యునిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’’ అన్నారు.

Advertisement
Kaikala Satyanarayana

సత్యనారాయణ గారి భౌతికకాయాన్ని చితివరకు మోసుకుంటూ వెళ్లి తుది నివాళులు అర్పించారు నిర్మాత అల్లు అరవింద్, యంపీ బాలశౌరి, టీటీడి బోర్డు మెంబర్, సినీ నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జీవిత, నిర్మాతలు ఏడిద రాజా, పి.సత్యారెడ్డి, దర్శకులు నక్కిన త్రినాధరావు, రాజా వన్నెం రెడ్డి, మాదాల రవి, ప్రజాగాయకుడు గద్దర్‌ , ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నటి ఈశ్వరీరావు, శివకృష్ణ తుది నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. చివరిగా (చితికి) పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అశ్రు నయనాలతో నిప్పంటించగా ప్రభుత్వ లాంఛనాలతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి కైకాల సత్యనారాయణ గారి అంతిమ సంస్కారాలని గౌరవంగా ముగించి ఆయన్ను సాగనంపారు.

Exit mobile version