Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Virata parvam: విరాట పర్వం తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా..?

Virata parvam: హీరో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట పర్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే నిన్ననే రిలీజ్ అయిన ఈ సినిమా… 1990ల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా చేసుకొని కథను రూపొందించారు. అయితే నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ప్రేమ కథఆ చిత్రమిది. ఇందులో దళ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించగా.. ఆయన రచనలతో ప్రేరణ పొంది ఆయన్ని ప్రేమించి దళంలో చేరటానికి వెళ్తుంది హీరోయిన్. అయితే రానా, సాయి పల్లవి ఈ సినిమాలో నటించడంతో… ఈ చిత్రంపై భారీ అంచనాలు రూపొందాయి.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున రూ.14 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. అయితే రూ.14050 కోట్లు రాబట్టుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి విరాట పర్వం తొలి రోజు సాధించిన వసూళ్లు ఎంత అని కామన్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.5 కోట్ల మేరకు అడ్వాన్స్ బుకింగ్స్ లో కలెక్షన్లను రాబ్టటుకుంది. ఇక ఓవర్ సీస్ లో 245 లొకేషన్స్ లో విడుదలైన ఈ సినిమా 60 వేల డాలర్లను రాబట్టుకుంది.

Advertisement
Exit mobile version