Jabardasth: గత తొమ్మిది సంవత్సరాల నుంచి బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే మనో, రోజా యాంకర్స్ రష్మి అనసూయ వంటి వారు ఎంతో ఫేమస్ అయ్యారు.
ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమానికి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకునే కమెడియన్స్, యాంకర్స్, రెమ్యూనరేషన్ పూర్తిగా తగ్గించినట్లు తెలుస్తోంది. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా పారితోషికం మినహా మిగిలిన వారందరికీ రెమ్యూనరేషన్ తగ్గించారని అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్స్, యాంకర్స్ కూడా ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్న వీరీ రెమ్యూనరేషన్ ఎప్పుడు పెరుగుతుందో తెలియాల్సి ఉంది.