Gruhalakshmi Fame: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ ఒకటి. ప్రతిరోజు ప్రసారమవుతుంది ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ తులసి పాత్రలో నటించిన హీరోయిన్ కస్తూరి ఈ పాత్రలో ఎంతో ఒదిగిపోయారు.ఒకానొక సమయంలో వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన కస్తూరి ప్రస్తుతం సీరియల్ ద్వారా ప్రేక్షకులను చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి ఈమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించిన కస్తూరి అనంతరం మాట్లాడుతూ ప్రతి రోజు సీరియల్స్ లో ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఏడుస్తూ చూసి చూసి విసుగు వచ్చింది. ఇలా బుల్లితెర నటీనటులందరిని ఈ వేదిక పై ఇలా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.ఈమె సినిమాల విషయానికి వస్తే నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ చెల్లెలి పాత్రలో నటించారు. అలాగే మరి కొన్ని తమిళ చిత్రాలలో నటించారు.ఇక వివాహం అనంతరం విదేశాలకు వెళ్లిన కస్తూరి కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయి తిరిగి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు.