Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rashmika mandanna: రష్మిక మందన్నాకు డైరెక్టర్ సుకుమార్ అన్యాయం.. పాపం!

Rashmika mandanna: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా నటించి.. బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా రిలీజ్ దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా పుష్ప సినిమా ఫీవర్ మాత్రం ప్రజలను ఇంకా వదలట్లేదు. అయితే ఈ క్రమంలోనే పుష్ప సినిమా డైరెక్టర్… పార్ట్ 2 ని కూడా తీస్తానని ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. పార్ట్ 1 లో హీరోయిన్ గా ఉన్న రష్మికా మందన్న పాత్రను.. పార్ట్ 2 లో పూర్తిగా తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప 1లో ఇప్పటికే పెళ్లి అయినట్లు చూపించడంతో… పార్ట్ 2లో శ్రీవల్లి పాత్రను పూర్తిగా తగ్గించబోతున్నట్లు సమాచారం. అలాగే విలన్ అయిన సునీల్, అనసూయ పాత్రలను పెంచతారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు కూడా లాక్ అయినందని అంటున్నారు. ఇక్కడ మరో వర్షన్ ఏంటంటే… రష్మిక పాత్రను చంపినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నెటిజెన్లు. మరి డైరెక్టర్ సుకుమార్ ఏం చేయబోతున్నారనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Advertisement
Exit mobile version