Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Dhanush SIR Movie Review : ధనుష్ ‘సార్’ మూవీ రివ్యూ.. లెక్కల మాస్టారుగా ఇరగదీశాడు..!

Dhanush-Sir-Review

Dhanush-Sir-Review

Dhanush SIR Movie Review : తమిళ హీరో ధ‌నుష్‌‌కు విలక్షణ నటుడిగా పేరొంది. ఒక్క త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ ధనుష్‌ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈసారి ధనుష్ మొదటిసారిగా ‘సార్’ అంటూ కొత్త మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ‘వాత్తి’ పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య చిత్రాన్ని నిర్మించారు. విద్య‌ను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కాలేజీల‌పై ఒక యువ‌కుడు చేసిన పోరాటమే ‘సార్‌’ మూవీ.. ఈ మూవీలో ధ‌నుష్‌, వెంకీ అట్లూరి ఏం చెప్పదలుచుకున్నారు అనేది తెలియాలంటే వెంటనే స్టోరీలోకి వెళ్లిపోదాం..

స్టోరీ :
సార్ మూవీ విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే కథాశంతో తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 17న భారీగా థియేటర్లలో రిలీజ్ అయింది. సినిమా కథ విషయానికి వస్తే.. క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ మూర్తి (సుమంత్‌) విద్యార్థులను కలిసేందుకు వెళ్తాడు. అక్కడ తమ గురువు బాల‌గంగాధర తిల‌క్ అలియాస్ బాలు (ధ‌నుష్‌) గురించి విద్యార్థులు గొప్పగా చెప్ప‌టంతో మొదలవుతుంది. 1993లో ప్రైవేటు కాలేజీల హ‌వా నడిచే రోజులివి.. ప్రైవేటు కాలేజీల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూస్తుంటారు. అప్పట్లో ప్ర‌భుత్వ కాలేజీల్లో స‌రైన టీచ‌ర్లు ఉండకపోవడమే కారణం.

Dhanush SIR Movie Review : లెక్కల మాస్టారుగా ధనుష్ ప్రేక్షకుల మనసులను గెలిచారా? 

త్రిపాఠి జూనియ‌ర్ కాలేజీలో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ఉన్న ధనుష్.. సిరిపురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీకి మ్యాథ్స్ టీచ‌ర్‌గా వస్తాడు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లెక్చ‌ర‌ర్స్ కూడా వ‌స్తారు. బ‌యాల‌జీ లెక్చరర్‌గా మీనాక్షి (సంయుక్తా మీన‌న్‌) వర్క్ చేస్తుంటుంది. ఆ కాలేజీలోని విద్యార్థుల త‌ల్లిదండ్రులు తమ పిల్ల‌లను చ‌దువు కన్నా ప‌నికి పంపడమే మంచిదని భావిస్తుంటారు. ఆ సమయంలో బాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు తీసుకొస్తాడు. బాలు కారణంగా త్రిపాఠి (స‌ముద్ర ఖ‌ని)కి అనేక స‌మ‌స్య‌లు వస్తాయి. ఆ సయమంలో బాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది తెలియాలంటే సినిమా తప్పక చూడండి..

Advertisement
Dhanush-Sir-Review

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ రోల్‌లో ధ‌నుష్ అద్భుతంగా నటించాడు. ఫ‌స్టాఫ్‌లో ఎంటర్‌టైన్ గా సాగిన మూవీ సెకండాఫ్‌లో మాత్రం ఎమోష‌న‌ల్ బాగా పండించాడు. ధ‌నుష్ తన న‌ట‌న‌తో అన్నింటిని బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో మాత్రం ధనుష్ పిండేశాడు.. హీరోయిన్ సంయుక్తా మీన‌న్ రోల్ మాత్రం పరిమితి తగినట్టుగా ఉంది. మరో నటుడు సాయి కుమార్ ప్రెసిడెంట్ రోల్ అద్భుతంగా చేశాడు. స‌ముద్ర ఖ‌ని తనదైన శైలిలో నెగటివ్ రోల్ లో మెప్పించారు.

ప్ర‌త్యేక పాత్ర‌లో సుమంత్, హైప‌ర్ ఆది తమ పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. విద్య అందరి ప్రాథ‌మిక హ‌క్కుగా చూపించే ప్రయత్నం చేశారు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. అదే తన కథలో ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌గా పాటలు, ఫైట్స్ అందించారు. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీన్స్ బాగానే పండించాడు. ల‌వ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్, నేపథ్య సంగీతం పర్వాలేదు. మొత్తం మీద ప్రతిఒక్కరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడదగిన సినిమా సార్.. అని చెప్పవచ్చు.

ధనుష్ ‘సార్’ మూవీ రివ్యూ
మూవీ రేటింగ్ : 2.75/5

Advertisement

Read Also : Valentines Night Movie Review : మంచి మెసేజ్ ను ఇచ్చే ‘వాలెంటైన్స్ నైట్’..

Exit mobile version