Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Biggboss Himaja : పెళ్లి, విడాకుల వార్తలపై.. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ క్లారిటీ..!

Biggboss Himaja, Biggboss Beauty Himaja Reddy, Himaja Marriage, Himaja Divorce news, Himaja Insta Account, బిగ్ బాస్ బ్యూటీ హిమజ, హిమజ పెళ్లి, విడాకులు, బిగ్ బాస్ హిమజ పెళ్లి వార్తలపై క్లారిటీ, హిమజా ఇన్‌స్టా

biggboss-himaja-biggboss-himaja-reddy-reacts-on-her-marriage-and-divorce-news-on-social-media

Biggboss Himaja : తెలుగు బిగ్ బాస్ బ్యూటీ హిమజా రెడ్డి పెళ్లి, విడాకులు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. హిమజాకు పెళ్లి అయిందని, విడాకులు కూడా తీసుకోబోతుందంటూ ఆ వార్తల సారాంశం.. వాస్తవానికి హిమజాకు అసలే పెళ్లి కాలేదు.. ఇంకా విడాకులు ఎలా తీసుకుంటుంది.. కానీ, సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానెళ్లలో హిమజ విడాకులు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్త తెలిసిన హిమజా స్నేహితులు, బంధువులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వార్తలను షాకైన హిమజా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తన ఇన్ స్టా అకౌంట్లో ఓ వీడియోను షేర్ చేసింది. గతకొద్ది రోజులుగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో నా పెళ్లి, విడాకుల న్యూస్ వస్తోంది. ఆ వార్తలను చూసి షాక్ అయ్యాను.. అయితే.. దయచేసి నా పెళ్లికి నన్ను కూడా పిలవండి.. అంతే.. నా విడుకుల గురించి కూడా నాకు చెప్పండి అంటూ గట్టిగానే సెటైర్ వేసింది. ఏంటో.. ఈ మధ్య నా వీడియోలు తెగ బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

కొన్నిరోజుల క్రితమే కొత్త ఇల్లు కట్టిస్తున్న వీడియోను షేర్ చేశాను. అది ఎవరికో బాగా జలసీ కలిగినట్టుంది. అందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ నాపై స్ప్రెడ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయాన్ని నా స్నేహితులు, శ్రేయాభిలాషులు నా దృష్టికి తీసుకొచ్చారు. నా గురించి ఫేక్ న్యూస్ రాసిన వాళ్లను కామెంట్ల రూపంలో తెగ తిట్టేశారు.. వారిందరికి నా కృతజ్ఞతలు చెబుతున్నాను.. అని హిమజా తెలిపింది.

Advertisement

Read Also : RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

Exit mobile version