Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss 6 Updates : బిగ్‌బాస్ హౌస్‌లో అమ్మాయిల రచ్చ, ఒంటీ మీద డ్రెస్ తీసేశారంటూ కామెంట్లు!

Bigg Boss 6 Updates : బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ జరుగుతోంది. అడవిలో ఆట అనే టాస్కులో పోలీసులు, దొంగల, అత్యాశ కల్గిన వ్యాపారస్థురాలు గీతూ ఉ్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులు, దొంగలు తమ తమ విధులను మరిచిపోయారు. గీతూ తన రూల్స్ ను తాను మరిచిపోయింది. పోలీసులే తాము కాపాడాల్సి వస్తువులను దొంగతనం చేసి జాగ్రత్తగా మూటకట్టి పెట్టేసుకున్నారు. ఇక గీతూ కూడా కొన్ని వస్తువులను తెచ్చి పెట్టుకుంది.

దీంతో బిగ్ బాస్ మరోసారి టాస్క్ గురించి వివరించాడు. పోలీసులు రైడ్ కు వెళ్లినప్పుడు దొంగలు వారిని పట్టుకోవచ్చు. రైడ్ టైం ముగిసిన తర్వాత కూడా పోలీసులు ఇంట్లోనే ఉంటే వారిని కిడ్నాప్ చేయొచ్చు. ఈ రూల్ ప్రకారం ఇనయను దొంగలు పట్టేసుకున్నారు. పోలీసులు స్టోర్ రూంను రైడ్ చేస్తామని చెప్పలేదు. అయినా కూడా ఇనయ లోపలకు వెళ్లింది. దీంతో దొంగలు ఆమెను పట్టుకున్నారు.

Advertisement

బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆమెను ఇద్దరి కంటే ఎక్కువే పట్టుకున్నారు. అయితే తనను తాను తప్పించుకునే క్రమంలో కొట్టిందో లేదంటే కావాలనే కొట్టిందో తెలియదు కానీ ఆరోహిని మాత్రం కాలితో తన్నింది. నేహ చెంప మీద వేసింది. దీంతో నేహ తెగ ఫీల్ అయింది. అంతలా కొట్టాలా అంటూ పంచాయితీ పెట్టింది. తన డ్రెస్ ని ఎవరో పైకి లాగారని ఇనయ అరిచింది. ఇవన్నీ తప్పు మాటలు అంటూ గీతూ మధ్యలోకి వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Read Also : Biggboss Revanth : రేవంత్ కు నేహా, ఆరోహి దొంగ దెబ్బ, పోలీసులకు రేవంత్ మద్దతు ప్రోమో…

Advertisement
Exit mobile version