Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌లో శ్రీహన్‌కు సిరి సర్‌ఫ్రైజ్ బర్త్‌డే విషెస్.. కేక కట్ చేస్తూ కేకలు.. హౌస్‌లో నుంచి శ్రీహన్ ఎలా చూస్తున్నాడో చూడండి..!

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌ సీజన్ 6లో కంటెస్టెంటుగా అడుగుపెట్టిన శ్రీహన్ తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. శ్రీహన్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తూ సెంటర్ ఆఫ్ యాక్షన్‌గా నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు శ్రీహన్ బర్త్‌డే.. అందుకే సిరి.. శ్రీహన్ కోసం ప్రత్యేకించి సర్‌ఫ్రైజ్ విషెస్ చెప్పేసింది.

ఎక్కడో కాదు.. బిగ్‌బాస్ హౌస్‌కు సమీపంలోనే.. ఒక భవనంలో నుంచి పక్కనే ఉన్న బిగ్‌బాస్ హౌస్ కనిపిస్తుంది. అందులో ఉన్న శ్రీహన్‌కు వినిపించేలా మైక్ పట్టుకుని మరి సిరి గట్టిగా కేకలు వేసింది. శ్రీహన్ హ్యాపీ బర్త్‌డే అంటూ విషేస్ చెప్పింది. వారి కుమారుడు కూడా హ్యాపీ బర్త్‌డే డాడీ అంటూ మైక్ పట్టుకుని చెబుతున్నాడు.

Bigg Boss 6 Telugu _ Siri Surprise Birthday Wishes to Srihan Bigg Boss 6 Telugu Near Bigg Boss House

అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ స్టూడియోకు దగ్గరలోని ఓ ఇంట్లో నుంచి బిగ్ బాస్ హౌస్ వైపు చూస్తూ శ్రీహన్ అంటూ సిరి పెద్దగా కేకలు పెట్టింది. శ్రీహన్ నీకు వినిపిస్తుందా అంటూ మైక్‌లో అతడికి బర్త్‌డే విషెస్ చెప్పింది. అంతేకాదు.. కేక్ కూడా కట్ చేసి శ్రీహన్ పుట్టినరోజు వేడుకులను జరుపుకున్నారు.

Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌లో శ్రీహన్‌ రియాక్షన్..     

సిరితో పాటు జెస్సీ, యాంకర్ శివ కూడా పక్కనే ఉన్నారు. వీరంతా కలిసి శ్రీహన్‌కు బర్త్‌డే సర్ ఫ్రైజ్ చేసేందుకు ఇలా ప్లాన్ చేశారానమాట. అంతేకాదు.. టపాసులు పేల్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో శ్రీహన్‌కు వినిపించేలా మైక్ పట్టుకుని సిరి హ్యాపీ బర్త్‌డే శ్రీహన్ అంటూ కేకలు పెట్టడాన్ని చూడవచ్చు.

Read Also : Minister roja dance: డ్యాన్స్ తో మెప్పించిన రోజా, మంత్రి అయ్యాక కూడా సూపర్ జోష్!

Advertisement
Exit mobile version