Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Natyam Movie: ఫినామినల్ ఉమెన్ డాన్స్ వీడియో పై ప్రశంసలు కురిపించిన ఏఆర్ రెహమాన్..?

Natyam Movie: సంధ్యా రాజు.. ఈ పేరు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె ఒక మంచి కూచిపూడి నృత్యకారిణి. అయితే సంధ్య రాజు ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. కానీ నాట్యం సినిమా విడుదల అయిన తర్వాత ఈమె ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ సినిమా తరువాత సంధ్య రాజు అనగానే ప్రతి ఒక్కరికి నాట్యం సినిమా గుర్తుకొస్తోంది. అంతలా సంధ్యా రాజుకు నాట్యం సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈమె నటించిన నాట్యం సినిమా 2021 అక్టోబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే.

Coolie Box Office Collections : 3వ రోజు ‘కూలీ’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజనీకాంత్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

ఈ సినిమా విడుదల అయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. మామూలు ప్రేక్షకులతో పోల్చుకుంటే కూచిపూడి, భరతనాట్యం లాంటి కళాకారులు ఈ సినిమాను అమితంగా ఇష్టపడ్డారు. ఇకపోతే ఇది ఇలా ఉంటే ఈమె నాట్యం సినిమాలో తన డాన్స్ తో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం పినామినల్ ఉమెన్ కు మోడ్రన్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ పర్ఫామెన్స్ వీడియోను రూపొందించారు.

Advertisement

Jr NTR : నన్ను క్షమించాలి.. జూ.ఎన్టీఆర్ వీడియో రిలీజ్.. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!

అనంతరం ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక ఈ పినామినల్ ఉమెన్ డాన్స్ వీడియోను చూసిన ఆ ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయినా ఏ ఆర్ రెహమాన్ ఈ వీడియో పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో దాదాపుగా మూడు లక్షల వ్యూస్ ను సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ఈ వీడియో కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మన తెలుగు అమ్మాయి, క్లాసికల్ డాన్సర్ జాతీయస్థాయి లో ప్రసిద్ధి చెందిన ఏ ఆర్ రెహమాన్ నుంచి ప్రశంసలు అందుకోవడం గర్వించదగ్గ విషయం అని చెప్పవచ్చు.

Advertisement
Bigg Boss Season 9 : బిగ్‌బాస్ సీజన్-9 ప్రోమో అదిరింది.. ఈసారి బిగ్‌బాస్‌‌నే లేపేశారుగా.. ఏంటయ్యా ఈ ట్విస్ట్..!
Exit mobile version