Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Akhil Comments: చైతన్య ఎలుకలా మారిపోతాడంటూ అఖిల్ కామెంట్లు!

Akhil Comments: నాగ చైతన్య, అఖిల్ క తల్లి కడుపున పుట్టకపోయినా చాలా క్లోజ్ గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ బంధాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటారు. చిన్నప్పుడు చైతన్య, అఖిల్ బాగా గొడవపడే వాళ్లట. అయితే ఒకే ఒక జీవితం ప్రమోషన్స్ లో అమలు.. అఖిల్, నాగ చైతన్య గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అమల చైకి ఇష్టమైన ఫుడ్ ఏంటని అఖల్ ను అడగ్గా.. చై అన్నయ్యకు ఐస్ క్రీంతో పాటు స్వీట్స్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

అర్ధరాత్రిళ్లు చైతన్య అన్న ఎలుకలా మారిపోతాడని చెప్పాడు. ఎలుకలా మారి ఫ్రీజ్ లో చిన్న చిన్న ముక్కలు కొరికేసి.. మిగిలిన వాటిని అక్కడే పెట్టేసేవాడని నాటి సంగతులను గుర్తు చేస్కున్నాడుయ అయితే తనకు కూడా ఐస్ క్రీం అంటే చాలా ఇష్టమని అఖిల్ చెప్పాడు. వెంటనే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఐస్ క్రీం తిని బతికేస్తున్నామంటూ పోకిరి సినిమా డైలాగ్ కొట్టాడు.

Advertisement

అంతే కాదండోయ్ చిరంజీవికి దోష, జూనియర్ ఎన్టీఆర్ కు హలీం, రామ్ చరణ్కు పప్పు, అప్పడం అంటే చాలా ఇష్టమని తెలిపాడు. అలాగే ప్రభాస్ దగ్గరకు తినేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని.. దాదాపు 30 నుంచి 40 రకాల ఐటమ్స్ మన ముందు పెడతాడంటూ అఖిల్ వెల్లడించారు.

Exit mobile version