Big Boss Non Stop Telugu: తెలుగు ఓటీటీలో ప్రసారమవుతూ ఏడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ఏడవ వారంలో భాగంగా మహేష్ విట్టాను ఎలిమినేట్ చేశారు. అయితే మహేష్ ఎలిమినేట్ కావడం ఆయన అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటింగ్ పరంగా ముందంజలో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే బిగ్ బాస్ మహేష్ ను ఎలిమినేట్ చేశారంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏడవ వారం మహేష్ ఎలిమినేట్ కావడంతో 8వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా ఎంతో హీట్ పెంచాయి.
ఇక అఖిల్ బిందుమాధవిని నామినేట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయిన స్రవంతి పేరును వాడుకోవడం తనకు ఏమాత్రం నచ్చడం లేదని బిందు మాధవిని నామినేట్ చేశారు. ఇక ఈ విషయానికి కౌంటర్ ఇస్తూ స్రవంతి గేమ్ కాదా? తను ఇక్కడికి మీకు సేవలు చేయడానికి వచ్చిందా? ఎంతో ఎమోషనల్ గా స్రవంతిని వాడుకున్నావ్ అంటూ బిందుమాధవి రెచ్చిపోయింది. ఇక బిందు మాధవి ఇలా మాట్లాడేసరికి అఖిల్ తీవ్రస్థాయిలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏయ్ ఏం మాటలు మాట్లాడుతున్నావ్… వాడుకోవడం ఏంటి?తను వెళ్లిపోయిన తర్వాత తన గురించి స్టాండ్ తీసుకున్నావ్ బిందు అంటూ మరోసారి తన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వీరిద్దరూ పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.
- Big Boss Non Stop Telugu: ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించిన యాంకర్ శివ… పూర్తి నెగిటివిటీ మూట కట్టుకున్న అషు రెడ్డి!
- Hyper Aadi: అఖిల్ సార్థక్ పై పంచులు వర్షం కురిపించిన ఆది, ప్రదీప్.. మామూలుగా ఆడుకోలేదుగా?
- Nagarjuna -Akhil: చిన్న కొడుకుతో కలిసి ప్రేక్షకులను సందడి చేయనున్న నాగార్జున… ఇందులో నిజమెంత?
