G
Telugu News » Entertainment » adavi shesh comments on akira nandan
⚡ Entertainment, Latest, Topstory

Akira nandan : అడవి శేష్ కు అకిరా నందన్ అంటే చాలా ఇష్టం అంట.. ఎందుకో తెలుసా?

Akira nandan : వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటించ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Akira nandan : వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటించిన చిత్రం మేజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా చాలా బాగుందంటూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా… మేజర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న అడవి శేష్… తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అకీరాతో అడవి శేష్ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Akira nandan

దీనిపై అడవి శేష్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం లేదని… అసలు అకీరాకి యాక్టింగ్ అంటే ఇష్టమో లేదో కూడా తెలియదని వివరించాడు. అకీరాకి మ్యూజిక్ అంటే ఇష్టం అని తెలిపాడు. అకిరా తనకి చాలా క్లోజ్ అని చెప్పాడు. పవన్ కల్యామ్ తో మాట్లాడింది చాలా తక్కువని కాకపోతే అకిరాతో రోజూ మాట్లాడుతుంటానని చెప్పాడు. అకీరా ప్లే చేసిన మ్యూజిక్ బైట్స్ ని తనకు సెండ్ చేస్తాడని వివరించాడు. అకిరా, తాను క్లోజ్ అని అడవి శేష్ వివరించారు.

Read Also : Keerthi suresh: మహేష్ బాబు గురించి కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్ట్.. అందులో ఏముందంటే?

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adavi shesh comments on akira nandanadavi shesh latest commentsAkira nandanakirana nadan and adavi shesh
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు