Jeevitha rajashekar : గరుడ వేగ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవిత, రాజశేఖర్ తమని మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడక్షన్స్ కు చెందిన కోటోశ్వర రావు, హేమ శుక్రవారం ఆరోహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలై జీవితా రాజశేఖర్ స్పందించారు. సుమారు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని.. ఇప్పుడు వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు. అలాగే కోటేశ్వర రాజు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని.. అవన్నీ తప్పేనని స్పష్టం చేశారు. అలాగే తాము ఎలాంటి తప్పు చేయలేదని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు.
అయితే ఈ గొడవకు సంబంధించి రెండు నెలల క్రితమే వారెంట్ వచ్చిందని.. తనకు ఎలాంటి సమన్లు అందలేదని వెల్లడించారు. అయితే మా గౌరవానికి భంగం కల్గించడం ఎవరి తరం కాదంటూ చెప్పారు. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటానని, తప్పులేక పోతే మాత్రం దేవుడిని కూడా ధైర్యంగా నిలదీస్తానని వ్యాఖ్యానించారు జీవిత. అయితే తమ గురించి ఆరోపణలు చేసే వారేం మహాత్ములు కాదని… వాళ్ల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడాల్సి వచ్చిందని వివరించారు. అయితే కోటేశ్వర రాజు, హమేల ప్రెస్ మీట్ ఆధారంగా యూట్యూబర్స్, మీమర్స్ చేసే కొన్ని కామెంట్లు చాలా బాధను కల్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయం చేసి పూర్తి విషయం తెలియకుండా తప్పుడు వార్తలు రాయొద్దని సూచించారు.
Read Also :Sarkaru vari para song : సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్.. పండగే ఇక!