Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Actress Jayavani : క్యారెక్టర్ ఆరిస్టు ‘జయవాణి’ సంచలన కామెంట్స్.. ఆ ముగ్గురు దర్శకులు తనతో అలా ప్రవర్తించారట..!

Actress Jayavani Shocking Comments

Actress Jayavani Shocking Comments

Actress Jayavani : తెలుగు చిత్ర పరిశ్రమ టాలెంట్ ఉన్న నటీనటులకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయిని ఎదగాలని మంచి ఆశయంతో వచ్చే వారికి ఆశ్రయం కూడా ఇస్తుంది. కళమ్మ తల్లి ఒడిలో ఇలా ఆశ్రయం పొందిన వారు చాలా మందే ఉన్నారు. ఇలా కష్టపడి పైకి వచ్చేవారిలో హీరోలే కాకుండా హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ కూడా ఉన్నారు. చిన్న పాత్రలు పోషిస్తూనే తమ నటనా ప్రావీణ్యంతో మంచి గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్టు జయవాణి కూడా ఒకరు.

ఈ నటి బుల్లితెర టెలివిజన్ షోలల్లో కూడా కనిపించింది.అయితే, కెరీర్ తొలినాళ్లలో ఆమె జీవితంలో ఎదుర్కొ్న్న అవమానాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయవాణి చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అన్ని విలన్ పాత్రలు మాత్రమే వచ్చేవని గుర్తు చేసుకుంది. అయితే, సినిమాల్లో లేడీ విలన్ క్యారెక్టర్స్ తక్కువగా ఉంటాయని చెప్పిన ఆమె.. తనకు ఒక రకమైన పాత్రలు చేయడం నచ్చదని తెలిపింది. తనకు ఏ రోల్ ఇచ్చిన దానికి వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు బోల్డ్ రోల్స్ చేయడం ఇష్టం లేదని తెలిపింది. తాను చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో చేయాలని ఇష్టంగా ఉండేదని, తన తండ్రి తాను ఏది చేయాలనుకున్న అడ్డు చెప్పలేదని, ఫ్రీడమ్ ఇచ్చాడని వెల్లడించింది.

తన పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగం చేసేవారని చెప్పారు. పేరెంట్స్ చెప్పారని తన మామయ్యను పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. తన భర్త చాలా మంచి వారని, సినిమాల్లో చేస్తానని అంటే అడ్డు రాలేదని చెప్పింది. ఇకపోతే తాను ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని, కొందరు దర్శకులు తనను కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను నల్లగా ఉంటానని అందుకే తనకు ఎక్కువగా సినిమా అవకాశాలు రాలేదని వివరించింది. ముగ్గురు డైరెక్టర్లు తాను నల్లగా ఉన్నానని కామెంట్స్ చేసినట్టు గుర్తుచేసుకుంది. ఆ తర్వాత మేకప్ నేర్చుకుని సినిమాల్లో అవకాశాలు పొందినట్టు వెల్లడించింది. ఇలాంటి ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నట్టు తెలిపింది.

Advertisement

Read Also : Bigg Boss 5 Telugu : నా భార్య ‘సిరి’లా ఉండాలంటున్న ‘జెస్సీ’.. తాను కూడా I love U చెప్పానని షాకింగ్ కామెంట్స్!   

Exit mobile version