SBI PO Admit Card 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అతి త్వరలో ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు అడ్మిట్ కార్డ్ జారీ చేయనుంది. ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షకు హాజరు అయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in)ని విజిట్ చేయాలి.
తద్వారా తమ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం.. SBI PO ప్రిలిమినరీ పరీక్షకు అడ్మిట్ కార్డ్‌ను జూలై మూడో లేదా నాల్గవ వారంలో జారీ చేయవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయాలి.
SBI PO Admit Card 2025 : SBI PO పరీక్ష ఎప్పుడంటే? :
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. SBI పరీక్షలో ఎంపికైన మొత్తం 541 మంది అభ్యర్థులను నియమించనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఆగస్టు 2, 4, 5 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు.
SBI PO Admit Card 2025 : అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? :
- అధికారిక వెబ్‌సైట్ sbi.co.in విజిట్ చేయొచ్చు.
- వెబ్‌సైట్ హోమ్ పేజీలో కెరీర్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
- మీరు ‘Admit Card Download’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.