Sri Rama Navami: తెలుగు ప్రజలకు పెద్ద పండగ ఉగాది పర్వదినం అనంతరం చైత్ర శుక్ల నవమి నాడు శ్రీరామనవమి పండుగను ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఈ పండుగను చైత్ర శుక్ల నవమి రోజు జరుపుకోవడానికి కారణం కూడా ఉంది. చైత్ర శుక్ల నవమి రోజున అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని, అదే రోజున సీతమ్మవారి తో శ్రీరామునికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ పర్వదినాన ప్రజలు శ్రీ రామ నవమి పండుగ రోజు సీతారాముల కళ్యాణం జరిపించి ఎంతో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.
శ్రీరాముడికి ప్రియ భక్తుడైన హనుమంతుడిని శ్రీ రామనవమి రోజున పూజిస్తే ఆ హనుమంతుడి కృపవల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి. శ్రీ రామ నవమి పండుగ రోజున శ్రీరాముని స్తోత్రాన్ని పటిస్తూ.. రామాయణం చదువుతూ.. నియమనిష్ఠలతో శ్రీరాముడికి పూజ చేయటం వల్ల ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారు.