Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టమే!

Horoscope : ఈరోజు అంటే బుధవరం మే 25వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఓ రెండు రాశులకు చాలా సమస్యలు రాబోతున్నాయి. అయితే ముందు చూపుతో వ్యవహరించి ఆ సమస్యలను తొలగించుకోంది. అయితే సమస్యలు ఎదుర్కోబోయే ఆ రెండు రాశులు ఏమిటి, ఆ సమస్యలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope

ముందుగా కన్యా రాశి.. ఈ రాశి వాళ్లు ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగడం మంచిది. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతే కాకుండా శత్రువుల జోలికి అస్సలే పోవద్దు. వారి వల్ల కూడా ప్రమాదాలు, సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

తులా రాశి.. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారు మీ చుట్టే ఉన్నారు. కాబయ్యి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు సాగండి. ఎవరితోనూ గొడవలకు వెళ్లకండి. చిన్నపాటి గొడవే అయినా మీకు చాలా నష్టాన్ని కల్గించే అవకాశం ఉంది. ఈశ్వర దర్శనం ఉత్తమం.

Advertisement

Read Also : Horoscope : ఈ వారం ఈ మూడు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

Exit mobile version