Shani Effect: సాధారణంగా గ్రహాలు రాశుల మార్పులు జరగడం సర్వసాధారణం ఈ క్రమంలోని ఏప్రిల్ 29వ తేదీ నుంచి జులై 12వ తేదీ వరకు గ్రహాలలో మార్పుల కారణంగా కొన్ని రాశి వారిపై శని ప్రభావం చూపించనుంది. శుభకృతనామ నామ సంవత్సర రారాజైన శని ఈ ఏడాది ఏప్రిల్ 29 వ తేదీ నుంచి జులై 12 వ తేదీ వరకు 75 రోజుల పాటు తన ప్రభావాన్ని పలు రాశుల వారిపై తీవ్రంగా చూపించనున్నారు. ఈ సంవత్సరంలో తన బద్ధ శత్రువు అయినటువంటి ధనిష్టా నక్షత్రంలో సంచరించనున్నారు.
ఇక ఈ 75 రోజుల పాటు శని ప్రభావం మీన రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారిపై శని ప్రభావం పడనుంది. ఇక ఈ 75 రోజులు శుభదినాలు లేకపోవటం వల్ల వ్యాపార రంగంలోపెట్టుబడులు పెట్టే వారు ఈ కొద్ది రోజుల పాటు వేచి చూసిన అనంతరం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ఎంతో మంచిది లేకపోతే తీవ్రస్థాయిలో నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.