Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kala Sarpa Dosha : కాల సర్ప దోషంతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

kala sarpa dosha nivarana remedies in telugu

kala sarpa dosha nivarana remedies in telugu

Kala Sarpa Dosha : ఈ భూమ్మీద ఉన్న వారిలో ఒక్కోరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. అనేక మంది తమ సమస్యలను ఇతరులకు చెప్పి బాధించరు. కానీ కొంత మంది మాత్రం చిన్న సమస్య వచ్చినా సరే ప్యానిక్ అయిపోతారు. తమ తోటి వారిని కూడా కంగారు పెడతారు. ఇక జ్యోతిష్య శాస్త్రాన్ని గనుక మనం పరిగణలోకి తీసుకుంటే అనేక సమస్యలు మనకు కన్పిస్తాయి.

అటువంటి వాటిలో కాల సర్ప దోషం ఒకటి. అసలు ఈ కాల సర్ప దోషంతో బాధపడే వారు జీవితంలో ఎటువంటి పనులు చేపట్టినా కానీ విఫలమవుతూ ఉంటాయి. కావున వీరు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అసలు ఈ కాల సర్ప దోష నివారణకు ఏం చేయాలనేదాని గురించి ఇప్పడు చూద్దాం..

అందరు దేవుళ్లకూ అధిపతి వినాయకుడు. అటువంటి వినాయకుడిని పూజించడం వలన మనకు ఉన్న కాల సర్ప దోషం తగ్గిపోతుందట. రాహు, కేతువుల నుంచి ఏర్పడే సమస్యలను నివారించుకోవడం కోసం గణేశుడు, మరియు సరస్వతి దేవీలను పూజించడం ఉత్తమం. అంతే కాకుండా ప్రతి రోజు భైరవాష్టకాన్ని పఠించడం వలన కాల సర్ప దోషం నుంచి విముక్తులు కావొచ్చు.

Advertisement

ప్రతి రోజు రుద్రాక్ష మాల సహాయంతో మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన కాల సర్ప దోషాన్ని దూరం చేసుకోవచ్చు. దశాంశ హవనం చేయడం వలన కూడా ప్రాయాశ్చిత్తం ఉంటుంది. మహా శివరాత్రి, నాగుల పంచమి, గ్రహణం మొదలగు రోజుల్లో పగోడాలో వెండి, రాగి నాగిణి జతను సమర్పించాలి. అంతే కాకుండా మీ పూజా మందిరంలో పామును పట్టుకున్న నెమలి, గరుడ దేవతల చిత్రపటాలను ఉంచి ప్రతిరోజు దర్శించుకోవాలి.

Read Also :Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్‌లో తన సపోర్టు అతనికే అంటున్న హీరో విశ్వక్ సేన్.. 

Advertisement
Exit mobile version