Akshay Tritiya: హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడమే కాకుండా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇలా ఈ రోజు లక్ష్మీదేవిని పూజించి బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల మన సంపద అభివృద్ధి చెందుతుందని భావిస్తారు. అలాగే అక్షయ తృతీయ రోజు కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజున మంచి పనులు చేయటం వివాహాలు చేయడం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు.
ఈ విధంగా కుజదోషంతో బాధపడేవారు అక్షయ తృతీయ రోజున వివాహం చేసుకోవడం వల్ల వారి జాతకంలో దోషం తొలగిపోయి వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. అక్షయతృతీయ వంటి ఎంతో పవిత్రమైన రోజున వివాహం చేసుకోవటం, శుభకార్యాలు చేసుకోవటం వల్ల హానికరమైన గ్రహాల ప్రభావం మనపై ఉండదని, అందుకే ఇంతటి పవిత్రమైన ఈ రోజున పెళ్లిళ్లు శుభకార్యాలు చేయటం మంచిదని పండితుల తెలియజేస్తున్నారు.