Devotional Tips: సాధారణంగా మనిషి అన్న తర్వాత వారికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా మనుషుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమతమయ్యేవారు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడానికి ఎన్నో పరిహారాలు పాటిస్తుంటారు. ఇలా సమస్యలు తొలగిపోవాలంటే చంద్రుడికి పరిహారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు. మరి చంద్రుడికి ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే…
పౌర్ణమి రోజు చంద్రుడికి ఎక్కువ మొత్తంలో నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచాలి.ఈ విధంగా చంద్రుడికి పెరగడం నైవేద్యం సమర్పించడంతో సంతృప్తి చెంది ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలను కలిగిస్తాడు. చంద్రుడికి సమర్పించిన పెరుగన్నం ప్రసాదం గా తీసుకున్న తర్వాత ఇతర ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడికి ఇలా చేయడంతో చంద్రుడు అనుగ్రహించి అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తాడు.