G
Telugu News » Devotional » good news for women gold and silver prices down on the occasion of akshaya tritiya
⚡ Devotional, Latest

Akshaya Tritiya: మహిళలకు శుభవార్త.. అక్షయ తృతీయ సందర్భంగా భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు!

Akshaya Tritiya: మహిళలకు ఎంతగానో నచ్చే, వారు మెచ్చే వాటిలో బంగారు నగలు ఒకటి. బంగారం అంటే మహిళలకు ఎనలేని ప్రీతి అని చెప్పవచ్చు. ఇలా ఏదైనా చిన్న ఆకాశం వచ్చిందంటే

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Akshaya Tritiya: మహిళలకు ఎంతగానో నచ్చే, వారు మెచ్చే వాటిలో బంగారు నగలు ఒకటి. బంగారం అంటే మహిళలకు ఎనలేని ప్రీతి అని చెప్పవచ్చు. ఇలా ఏదైనా చిన్న ఆకాశం వచ్చిందంటే చాలు వెంటనే బంగారు నగలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు.ఇక నేడు అక్షయ తృతీయ కావడంతో పెద్ద ఎత్తున మహిళలు వెండి బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు.

ఈ క్రమంలోనే నేడు అక్షయ తృతీయ కావడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కేవలం బంగారు ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా తగ్గాయి. మరి నేడు బంగారు వెండి ధరలు ఎంత తగ్గాయి, ప్రాంతాలవారీగా ఎంత ధరలు ఉన్నాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… నిన్నటితో పోలిస్తే నేడు బంగారంపై కుమారు 1190 రూపాయలు తగ్గినట్టు తెలుస్తోంది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 47200 రూపాయలు ధర ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 51,510 రూపాయలు ఉంది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 47,200, 24 క్యారెట్ల బంగారం 51,510 రూపాయలు ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 48,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 52,970 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు నిన్నటితో పోలిస్తే కేజీ వెండి పై 1900 రూపాయలు ధర తగ్గింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాలలో కిలో వెండి 67, 600 రూపాయలు ఉండగా, ముంబై ఢిల్లీ లో కిలో వెండి 62,700 రూపాయలు ఉంది.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Akshaya tritiyagoldpricessliver
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు