Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devotional : మూగవాడికి మాటలు వచ్చాయి.. అంతా ఆ దేవుడి మహత్మ్యమే!

Devotional : రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ఓ వ్యక్తికి ఓ ప్రమాదం మూడేళ్ల క్రితం మాటలు పోయాయి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు. అందతా గుడి మహత్మ్యం అంటున్నారు గ్రామస్థులు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కేశం పేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కింద పడ్డాడు.

బ్రెయిన్ కు గాయాలు అవ్వడంతో అతడు మాటలు కోల్పోయాడు. చాలా ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. చివరకు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే.. మాటలు వస్తాయని వివరించారు. అంత మొత్తం చెల్లించే స్తోమత లేక కుటుంబ సభ్యులు అలాగే వదిలేశారు. ఈ క్రమంలో గ్రామంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Devotional

స్థానికులతో కలిసి బ్రహ్మచారి కూడా వీర్ బ్రహ్మేంద్ర స్వామి దీక్ష చేపట్టాడు. దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఆదివారం ఉదయం ఆలయ గర్భగుడిని శుభ్రం చేస్తుండగా… ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయి మాట్లాడడం ప్రారంభించాడు. మొదటగా గర్భ గుడిలో ఉంటేనే మాటలు రావడం… బయటకి వస్తే రాకపోవడం గమనించారు. దీంతో స్వామి వారికి 11 బిందెల నీటితో అభిషేకం చేయగా… పూర్తిగా మాటలు రావడం మొదలైంది. గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడంతో ఈ అద్భుతం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.

Advertisement

Read Also : Sri Hanuman : శ్రీ హనుమాన్ విజయోత్సవ విశిష్టత ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Exit mobile version