G
Telugu News » Devotional » do you know the benifits of chanting gayatri mantra in telugu
Devotional, Latest, Topstory

Gayatri mantra : గాయత్రీ మంత్రం జపించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

Gayatri mantra : గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి నుంచి ఉఫశమనం లభిస్తుంది. అందకే చాలా మంది గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటార

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Gayatri mantra : గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి నుంచి ఉఫశమనం లభిస్తుంది. అందకే చాలా మంది గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటారు. అయితే గాయత్రీ మంత్రాన్ని సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయంలో చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖం, బాధలు, దరిద్రం, పాపాన్ని పోగొట్టడంలో గాయత్రీ మాత ముందుంటుంది. ఆమెను కటాక్షం పొందాలంటే గాయత్రీ మంత్రం చదవాల్సిందే. అలాగే సంతానం కోసం, పనిలో విజయం కోసం, జ్ఞాపక శక్తి పెరిగేందుకు, పితృ దోషం, కాల సర్ప దోషం, రాహు-కేతు, శని దోషాల నుంచి విముక్తి కోసం గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.

do-you-know-the-benifits-of-chanting-gayatri-mantra-in-telugu

గాయత్రీ మంత్రం.. ఓం భూర్భవః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధ్యో యో నః ప్రచోదయాత్..

గాయంత్రీ మంత్రం అర్థం..

ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.

Advertisement

Read Also : Kubera Dhana Mantra : ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఈ ఒక్క మంత్రం పఠిస్తే చాలు..!

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

🏷gayathri manthramgayatri mantramimportance of gayatri mantrauses of gayatri manta
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు