Akshaya Tritiya: ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి రోజున పెద్ద ఎత్తున అక్షయతృతీయ వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని, సంపద పెరుగుతుందని భావిస్తారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు కుమారుడు అక్షయ్ కుమార్ వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ రోజు జన్మించాడు. అందుకే ప్రతి ఏడాది ఈ రోజున అక్షయ తృతీయను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అలాగే దేవుడి గదిలో బియ్యపుపిండితో ముగ్గు వేసే అనంతరం దానిపై పీట వేయాలి. పీట కింద పసుపు, బియ్యం వేయాలి. అనంతరం కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పై పెట్టాలి. ఈ కలశాన్ని కూడా మావిడాకులు, పువ్వులు, నూలుపోగుతో చక్కగా అలంకరించుకోవాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసిన తర్వాత పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని ఆ వినాయకుడికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. అలాగే మన ఇంట్లో ఏవైనా బంగారు ఆభరణాలు ఉంటే కలశానికి సమర్పించి పూజించాలి. అలాగే చక్కెర పొంగలి, పాలతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అక్షయ తృతీయ రోజు వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మన స్తోమత కొద్ది దానధర్మం చేయడం ఎంతో మంచిది.