Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bathukamma 2022: తొమ్మిది రోజుల పాటు బతుకమ్మకు ఏం నైవేద్యం పెడతారో తెలుసా?

Bathukamma 2022: ఆశ్వీయుజ అమవాస్య నాడు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అయితే దీన్ని తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకంటారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ చేస్తారు. అయితే ఏ రోజు ఏ నైవేద్యం చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంగిలి పూల బతుకమ్మ.. మహా అమవాస్య రోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

Advertisement

అటుకుల బతుకమ్మ.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ.. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ.. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ.. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

Advertisement

అలిగిన బతుకమ్మ.. ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ.. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ.. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

Advertisement

సద్దుల బతుకమ్మ.. ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

Advertisement
Exit mobile version