Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya

Ashadha Amavasya

Ashadha Amavasya : హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యనే ఆషాఢ అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున, పూర్వీకులను ఆచారాలు, ప్రార్థనల ద్వారా గౌరవిస్తారు. ఆషాఢ అమావాస్య తేదీ, సమయం, ప్రాముఖ్యతకు అనేక విషయాలు (Ashadha Amavasya significance) తెలుసుకోవచ్చు. అమావాస్యను హిందూ మతంలో ఒక ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు.

కొంతమంది పవిత్ర నదిలో స్నానం చేస్తారు. మరికొందరు ఇంట్లో కొన్ని ఆచారాలను నిర్వహస్తారు. ఈ రోజును పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. పూజలు చేసి దానధర్మాలు చేయాలి. పూర్వీకుల ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతారు. ఆషాఢ అమావాస్య తేదీ, సమయం, ప్రాముఖ్యతను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆషాఢ అమావాస్య 2025 తేదీ, సమయం ఎప్పుడు? :

ఈ సంవత్సరం, ఆషాఢ అమావాస్య జూన్ 25న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం.. అమావాస్య తిథి జూన్ 24న (Ashadha Amavasya Date) సాయంత్రం 6:59 గంటలకు ప్రారంభమై జూన్ 25న సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

Advertisement

Read Also : TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

Ashadha Amavasya : ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత :

ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున నిర్వహించే వేడుకలలో ఒకటి దీప పూజ. ఇళ్లను శుభ్రం చేసి అలంకరిస్తారు. ఒక టేబుల్‌ను కూడా ఏర్పాటు చేసి, ప్రకాశవంతమైన రంగుల దీపాలతో అలంకరిస్తారు. ఈ ఆచారం సాధారణంగా ఇష్ట దేవత లేదా కుల దేవతకు, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి అనే 5 అంశాలకు అంకితం చేశారు.

లక్ష్మీ, పార్వతి లేదా సరస్వతి దేవతలను కూడా పూజిస్తారు. ఎందుకంటే వారిని పూజించడం వల్ల ప్రతికూలత తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. అన్ని అమావాస్య దినాలు పూర్వీకుల ఆత్మలను సంతృప్తి పరచడానికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటాయి. అమావాస్య రోజులు కాల సర్ప దోష నివారణ పూజ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటాయి.

Advertisement
Exit mobile version