Crime News: మందు, సిగరెట్టు,గంజాయి తీసుకోవటం వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడి వాటికి బానిసలు అవుతున్నారు. గంజాయి కి అలవాటు పడిన ముగ్గురు యువకులు ఇటీవల నేరాలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..నర్సీపట్నం కు చెందిన రాజేష్, గాజువాక కు చెందిన నాని, శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన స్వరూప్, విశాఖ కు చెందిన కళ్యాణ్ మంచి స్నేహితులు. గంజాయి కి అలవాటు పడిన వీరు డబ్బులు లేక దారి దోపిడీలు చేసి మరీ గంజాయి తీసుకుంటున్నారు.
ఈ ఘటన గురించి రాజారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇప్పటికే పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న రాజేష్ నర్సీపట్నం వెళ్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో కొందరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి విచారించగా అసలు విషయం బయటపడింది. దొండపూడి వద్ద భారీ దొండపూడి పాల్పడిన దొంగలు వారేనని నిర్ధారించారు. వారి వద్ద నుండి 85 వేల రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేయగా మరొక యువకుడు పరారీలో ఉన్నాడు.
