Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Wife murdered husband: 15 మంది ప్రియుళ్లు, భర్త హత్య, ఆదర్శ మహిళామణి!

Wife murdered husband: యలహంకలో నేత కార్మికుని దారుణ హత్య కేసులో భార్య శ్వేత లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినప్పిటికీ.. పట్టించుకోకుండా అడగులేసింది. ఇప్పుడు కటకటకాలు లెక్కిస్తోంది. ఈనెల 22వ తేదీన యలహంక కొండప్ప లేఓట్ లో మేడపై హత్యకు గురైన సత్యసాయి జిల్లా హిందూపురం వాసి చంద్రశేఖర్ కేసులో భార్య శ్వేత, ఆమె ప్రియుడు సురేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సురేష్ ను పిలిపించి హత్య చేయించినట్లు విచారణలో తెలిపింది. బెంగళూరులో ఎంఎస్సీ చదివిన శ్వేత కళాశాలలో పలువురు స్నేహితులతో డేటింగ్ చేసింది. టీవీలు సినిమాలు చూసి అదే లోకం అనుకుంది. ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండడం గొప్పగా భావించింది. కనీసం 15 మది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని కొన్ని రోజులు షికార్లు చేసిన తర్వాత వారిని బ్లాక్ లిస్టులో పెట్టేదని తెలిసింది.

Advertisement

ఇంటి యజమాని కుమారుడితో చనువుగా మెలిగింది. అతనితో బైక్ పై కాలేజీకి వెళ్లేది. ప్రియుడు సురేష్ తో సంబంధం కొనసాగిస్తూనే చంద్ర సేఖర్ ను పెళ్లి చేసుకుంది. ఈ విషయాలన్నీ ఆయనకు తెలియడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రియుడితో పథకం వేసి ఈనెల 22వ తేదీన హత్య చేశారు. మేడ మీదకు తీసుకెళ్లి రాడ్డుతో తలపై కొట్టి, మర్మాంగం కత్తిరించి హత్య చేశారు.

Exit mobile version