Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Wife Kills Her Husband : మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి, పిల్లల కోసం దారుణం!

Wife Kills Her Husband: తెన్ కాశి సమీపలోని ఇటీవలే దారుణం జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు బైక్ పై వెళ్తుండగా.. ఓ ముఠా అడ్డుకుంది. యువకుడుని హత్యే చేసిన అతడి భార్య మెడలో ఉన్న పుస్తెల తాడును లాక్కెళ్లారు. దీంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు ఇదంతా కావాలని భార్య ఆడిన హై డ్రామాగా గుర్తించారు. తెన్ కాశి జిల్లా సెందామరం సమీపంలోని వెండ్రిలింగాపురానికి చెందిన వైరస్వామి, ముత్తుమారి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేస్కున్నారు.

ఇద్దరూ వెండ్రిలింగాపురంలోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. స్థానికంగా ఉన్న ఓ హోల్ సేల్ ఫర్నిచర్ దుకాణంలో వీరిద్దరూ పని చేస్తున్నారు. రోజూ ఉదంయ ఇద్దరూ కలిసి వెళ్లి కలిసే తిరిగొచ్చేవారు. ఈ క్రమంలోనే వైరస్వామిని ఓ ముఠా చంపేసింది. ముత్తుమారి మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

Advertisement

అయితే పెళ్లికి ముందు ముత్తుమారికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. పెళ్లి అయ్యాక కూడా ఈమె అప్పుడప్పుడూ అతడిని కలిసేది. ఈ క్రమంలోనే భర్త తమకు అడ్డుగా ఉన్నాడని భావించి అతడి హత్యకు పతకం వేసింది. ప్రియుడితో చంపించింది. ప్రస్తుతం ముత్తుమారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె ప్రియుడు, మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Exit mobile version