Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

7 people died in Fire accident: లుథియానాలో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం!

పంజాబ్​లోని లుథియానాలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. చనిపోయిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అందులోనూ ఇద్దరు దంపతులు వారు సంతానమైన ఐదుగురు పిల్లలు ఒకేసారి చనిపోవడం చూపరులను కంట తడి పెట్టిస్తోంది. అయితే అర్థరాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా ఉపాధి కోసం లుథియానాకు వలస వచ్చిన కార్మికులుగా అధికారులు గుర్తించారు.

అసలే ఎండాకాలం ఆపై కాస్త మంట వచ్చినా ఎలాంటి ఇళ్లైనా తగలబడిపోతుంది. కాబట్టి ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో మంటలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని గురించి తెలుసుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఐదుగురు చిన్న పిల్లలు సహా దంపతులు సజీవ దహనం అవ్వడం చాలా బాధాకరం అని వివరిస్తున్నారు.

Advertisement
Exit mobile version