Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Youtuber suicide: వ్యూస్ రావట్లేదని యూట్యూబర్ ఆత్మహత్య.. ఎక్కడో తెలుసా?

Youtuber suicide: తాను చేసే వీడియోలకు వ్యూస్ రావట్లేదని.. అలాగే తన ఛానెల్ కు సబ్ స్క్రైబర్స్ కూడా పెరగట్లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే 24 ఏళ్ల వయసున్న డీనా అనే ఇంజినీరింగ్ విద్యార్థి సెల్ ఫ్లో అనే గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. తనకు చేసే వీడియోలకు అనుకున్నంతగా వ్యూస్ రావడం లేదు. దీంతో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రాంతి నగర్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. డీనా ఐఐటీ గ్వాలియర్ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే సెల్ ఫ్లో అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ… లైవ్ గేమ్స్ ఆడేవాడు. కొంత కాలంగా అతడికి అనుకున్నంతగా వ్యూయర్ షిప్ రావడం లేదు. సబ్ స్క్రైబర్స్ కూడా పెద్దగా పెరగలేదు. దీంతో ఆందోళనకు గురైన అతడు తన ఆవేదనను యూట్యూబ్ లో పంచుకున్నాడు. అనంతరం ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేస్కున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Exit mobile version