Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Extra Marital Affair : మామిడి తోటలో ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య… ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

extrra marital affair

extrra marital affair

Extra Marital Affair : సుఖంగా సాగే దాంపత్య జీవితంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాన్ని పాడుచేసుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు రోజు వింటూనే ఉంటున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం వంకరవారిపల్లి గ్రామంలో గణేష్, నందినిలు గత కొద్ది ఏళ్లుగా నివాసం ఉంటున్నారు.

వీళ్లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది. గణేష్ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ కూలీ పనుల కోసం బయట ప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడు. ఈ సమయం లోనే నందినికి అదే గ్రామంలో ఉన్న రెడప్ప అనే‌ యువకుడితో పరిచయం ఏర్పడింది. రెడప్ప డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు.

వీరి స్నేహం వివాహేతర సంబంధంగా మారింది. గణేష్ ఇంటిలో లేని సమయంలో రెడప్ప ఇంటికి వచ్చేవాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లు గణేష్ కు తెలిపారు. దీంతో భార్య నందిని ప్రవర్తన మార్చుకోవాలని గణేష్ మందలించాడు. కానీ తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన గణేష్ నందినిని నిలదీసేందుకు ఒకరోజు హఠాత్తుగా ఇంటికి వచ్చాడు.

Advertisement

ఇంట్లో నందిని లేకపోవడంతో సన్నిహితుల ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకున్నాడు. తుంబకుప్పం గ్రామానికి చెందిన ఓ రైతు మామిడి తోటలో ఆమె ఉందని అక్కడికి వెళ్ళి చూసేసరికి ప్రియుడితో తన భార్య ఉండడంతో షాకయ్యాడు. కోపంతో రెడ్డప్పపై దాడికి దిగాడు గణేష్. దీంతో నందిని, రెడ్డప్ప కలిసి గణేష్ ను ఓ చెట్టుకు కట్టేసి దాడిచేశారు.

తీవ్ర రక్తపు మడుగులో గణేష్ సృహ కోల్పోయాడు. దీంతో అక్కడి నుంచి రెడప్ప, నందినిలు పరారయ్యారు. ఆ తర్వాత మామిడి తోపులో పనిచేస్తున్న కూలీలు గణేష్ ను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నందిని, రెడప్పల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Read Also : మన భారతీయ నదుల గురించి ఆస్తకిరమైన వాస్తవాలు ఇవే..!

Exit mobile version