G
Telugu News » Crime » after 3 years of marriage shocking truth revealed about husband
⚡ Crime, Latest, Trending

Viral news : పెళ్లై మూడేళ్లవుతున్నా ఫస్ట్ నైట్‌కు నో.. గట్టిగా అడిగితే షాకిచ్చిన మొగుడు

Viral news: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక జీవితం హ్యాపీగా ఉంటుందని కలలు కన్నది. భర్తతో అచ్చటా ముచ్చటా ఉంటుందని , తాను సంతోషంగా గడపొచ్చని అనుకుంది ఆ య

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Viral news: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక జీవితం హ్యాపీగా ఉంటుందని కలలు కన్నది. భర్తతో అచ్చటా ముచ్చటా ఉంటుందని , తాను సంతోషంగా గడపొచ్చని అనుకుంది ఆ యువతి. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. పెళ్లై మూడేళ్ల తర్వాత తనకు ఓ నిజం తెలిసింది. తాను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. కన్న కలలు బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయాయి. అసలేం జరిగిందంటే..

Advertisement

ఇండోర్ కు చెందిన ఓ యువతికి 2019లో ప్రీతేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఆమె తల్లిదండ్రులు రూ.25 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతికి ప్రతి దాంట్లోనూ షాక్ తగులుతూ వచ్చింది. కొత్త కదా అని అన్నీ సర్దుకుపోయింది ఆ యువతి. మొదటి రాత్రి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమెకు భర్త షాకిచ్చాడు. దగ్గరకు తీసుకుని ఊసులాడాల్సిన వాడు దూరం పెట్టాడు. ఆమె చొరవ తీసుకుని దగ్గరకు వెళ్తే తిట్టేవాడు. వాటిని పంటి బిగువన భరించింది ఆ యువతి. అలా మూడేళ్లు గడిచాయి.

కానీ ఒక్కసారి కూడా భార్యభర్తలకు శారీరకంగా దగ్గర కాలేదు. ఓపిక నశించిన యువతి కొడుకు చేస్తున్న తంతు గురించి అత్తగారికి చెప్పింది. అప్పుడు అత్తగారు చెప్పిన మాట విని షాక్ కు గురైంది ఆ యువతి. తన కొడుకుకు మానసిక, శారీరక సమస్యలు ఉన్నాయని, త్వరలోనే సర్దుకుంటాయని చెప్పింది.

మరోవైపు తన లోపాన్ని భార్య ఎక్కడ బయట పెడుతుందోనని భయపడ్డ ప్రితీషే కట్నం నాటకం ఆడటం మొదలు పెట్టాడు. రూ. 20 లక్షలు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో ఆ యువతి… అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ప్రితీష్ పై, అతని తల్లిదండ్రులపై కేసు పెట్టారు.

Advertisement

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷actress archana and her husbandhusband fraud wifeindore newsviral news
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు