Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Uttarakhand : భర్తను మోసం చేసి కన్న కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకున్న మహిళ..?

Uttarakhand : ఈరోజుల్లో సభ్యసమాజం సిగ్గు పడేలా కొన్ని సంఘటనలు చోటచేసుకుంటున్నాయి. ప్రజలు వావి వరుసలు మరచి అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. కడుపున పుట్టిన వారు, కన్న తల్లి అని కూడా కనికరం లేకుండా కామ వాంఛలు తీర్చుకోవటానికి లైంగిక దాడి చేస్తూ కొందరు పురుషులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ కాలంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉన్నట్టు ఇటువంటి విషయాలలో కూడా వారితో సమానంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త పిల్లలను మోసం చేస్తూ వారికి అన్యాయం చేస్తున్నారు.

Uttarakhand

ఇటీవల ఇటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ అనే మహిళ ఇంద్రరామ్ అనే వ్యక్తిని 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. మొదటి భర్తతో బబ్లీకి మనస్పర్థలు రావడంతో అతని నుండి విడిపోయి ఇంద్ర రామ్ ని రెండవ వివాహం చేసుకుంది. మొదటి భర్తతో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన బబ్లీ, రెండవ భర్తతో ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది. ఇంద్రరామ్ , బబ్లీ కొంతకాలం సజావుగా సాగింది. ఈ క్రమంలో బబ్లీ కి మొదటి భర్త వల్ల జన్మించిన కుమారుడు తరచు తల్లి వద్దకు వచ్చి వెళ్ళేవాడు.

గత కొంత కాలంగా తన తల్లి వద్దకు వచ్చి వెళ్తున్న కుమారుడి మీద ఇంద్రరామ్ కి అనుమానంగా ఉండేది. ఒకరోజు సడెన్ గా ఇద్దరు ఇంట్లో ఉన్న 20 వేల రూపాయల డబ్బు తీసుకొని ఇంటి నుండి పారిపోయారు. అయితే వారిద్దరూ ఇంటి నుండి పారిపోయి వివాహం చేసుకొని ఉంటారని ఇంద్రరామ్ అనుమానంతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గురించి కేస్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

Advertisement

Read Also :Viral news: ఎమ్మెల్సీ కారులో శవం.. చంపేశారంటూ బంధువుల ఆరోపణ!

Exit mobile version