Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Slice Savings Account : ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయండి.. రోజువారీగా వడ్డీపై వడ్డీ సంపాదించండి

Slice Savings Account

Slice Savings Account

Slice Savings Account : మీరు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. సాధారణంగా బ్యాంకులో డబ్బులు దాచుకుంటే పెద్దగా వడ్డీ రాదంటారు. అందరూ తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు.

డబ్బును దాచుకునేందుకు బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేసి (Slice Savings Account) అందులో డబ్బులను డిపాజిట్ చేస్తారు. బ్యాంకులు అనేక రకాల అకౌంట్లను అందిస్తున్నాయి. అందులో ఒకటి సేవింగ్స్ అకౌంట్.. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లు ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో రాబడిని అందిస్తాయి. అందుకే సేవింగ్స్ అకౌంట్ అని పిలుస్తారు.

Slice Savings Account : 3 శాతం వరకు డబ్బుపై రాబడి :

ఎందుకంటే.. ఈ అకౌంటులో జమ చేసిన డబ్బుపై కూడా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. దేశంలోని వివిధ బ్యాంకులు తమ సేవింగ్స్ అకౌంట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తాయి. సాధారణంగా, బ్యాంకులు 2 శాతం నుంచి 3 శాతం వడ్డీ రేటుతో సేవింగ్స్ అకౌంట్లపై రాబడిని అందిస్తాయి.

Advertisement
Slice Savings Account

కస్టమర్లకు వారి సేవింగ్స్ అకౌంట్లపై భారీ వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు ఉన్నాయి. ఈ సేవింగ్స్ అకౌంటులో మీ డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా మీరు అద్భుతమైన రాబడిని పొందవచ్చు. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ :

స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ కస్టమర్లకు వారి సేవింగ్స్ అకౌంట్లపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ఇతర బ్యాంకుల కన్నా చాలా ఎక్కువ. ముఖ్యంగా, ఈ సేవింగ్స్ అకౌంట్లకు కనీస బ్యాలెన్స్ పరిమితి లేదు. నిర్వహణ ఛార్జీలు లేదా పెనాల్టీలు కూడా లేవు. వడ్డీని రోజువారీగా లెక్కించి ప్రతిరోజూ అకౌంటులో వడ్డీ జమ అవుతుంది.

ఉదాహరణకు, మీ అకౌంటులో రూ లక్ష ఉంటే.. మీరు వార్షిక వడ్డీలో రూ. 5,250 సంపాదిస్తారు. తద్వారా మీరు ప్రతిరోజూ రూ. 14 వడ్డీని సంపాదిస్తారు. రోజువారీ వడ్డీని సంపాదిస్తూ కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. మీరు వడ్డీపై వడ్డీని సంపాదిస్తారు అనమాట.

Advertisement
Exit mobile version