Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Business Ideas: ఏటీఎం పెట్టి నెలకు 70 వేరు సంపాదించొచ్చు తెలుసా, ఎలాగంటే?

Business Ideas: ఈరోజుల్లో ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారం చేయడానికే ఎక్కువ మంది ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఎవరి కిందో నేనెందుకు పని చేయాలనే ధోరణి ఎక్కువైంది. ఎందుకంటే ఉద్యోగం వల్ల దాదాపు విలువైనంత కాలమంతా ఆఫీసులోనే గడిచిపోతుంది. ఇంత కష్టపడ్డా బ్యాంకు బ్యాలెన్స్ చూస్కుంటే మాత్రం ఏమీ ఉండదు. అదే వ్యాపారంలో అయితే ఓ పదేళ్లు గట్టి కష్టపడితే చాలు.. ఆ తర్వాత అన్నీ లాభాలే. లక్షల్లో సంపాదించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఏటఎం ఫ్రాంచౌజీని తీస్కోవడం వల్ల ప్రతి నెలా 60 నుంచి 70 వేల రూపాయలు సంపాదించవచ్చు. ఇందు కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గర్లోని బ్యాంకు లేదా ఏటీఎం కంపెనీకి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

ITR Filing 2025 : టాక్స్ పేయర్లు ITR ఫైలింగ్ సమయంలో ఈ 8 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే మీకు ఐటీ నోటీసులు రావచ్చు!

Singer Chaiwala : ఈ టీ అమ్మేవాడు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్.. ఇతడి టీ తాగి పాట కోసం జనాలు పిచ్చెక్కిపోతున్నారు..!

మీరు ఏటీఎం మెషీన్ ద్వారా ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి. ఉదాహరణకు టాటా ఇండిక్యాష్ వైట్ లేబుల్ ఏటీఎంలను ఇన్ స్టాల్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చు. మీరు దాని కోసం ముందుగా దరఖాస్తు చేస్కోవాలి. వివరాల కోసం వారి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఏటీఎంను ఇన్ స్టాల్ చేయడానికి మీకు 50 నుంచి 80 అడుగుల చదరపు స్థలం ఉండాలి. ఇది ఇతర ఏటీఎం నుండి కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. ప్రజలు సులభంగా ఏటీఎంను చూడగలిగే ప్రదేశంలో ఉండాలి. ఇది కాకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండాలి. విద్యుత్ కనెక్షన్ 1.kW ఉండాలి. ఏటీఎం ఏర్పాటు చేసే సీలింగ్ కాంక్రీట్ తో ఉండాలి. ఏదైనా సొసైటీలో ఉన్నట్లయితే యంత్రాన్ని ఇన్ స్టాల్ చేయడానికి సొసైటీ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం.

Advertisement
Coloured Milestones : రోడ్డు మీద మైలురాళ్ళు వేర్వేరు రంగులలో ఎందుకు ఉంటాయి? 99 శాతం మందికి ఇది తెలియదు!
Exit mobile version