- క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ హెచ్చరిక
- ఏప్రిల్ 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డు నిబంధనలు అమల్లోకి
- క్రెడిట్ కార్డుపై ఎక్కువగా ఖర్చు చేసేవాళ్ళు జాగ్రత్త
- క్రెడిట్ ప్రతి స్వైప్ పై పన్ను నోటీసులు రావొచ్చు
- ఆదాయపు పన్ను ముసాయిదా నియమాలు 2026
Credit Card Users : క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను నిబంధనల ముసాయిదా ప్రకారం క్రెడిట్ కార్డు ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఇటీవల డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026 విడుదల చేసింది. ఇది ఆమోదం పొందితే ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.
ప్రస్తుత ఆదాయపు పన్ను రూల్స్ 1962 చట్టం స్థానంలో వస్తాయి. ఈ ప్రతిపాదిత నియమాలలో క్రెడిట్ కార్డ్ యూజర్లకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిబంధనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బిల్ పేమెంట్లు, పన్ను రిపోర్టింగ్, ఉద్యోగులకు అందించే క్రెడిట్ కార్డు ప్రయోజనాలపై ప్రభావం పడొచ్చు.
Credit Card Users: భారీ క్రెడిట్ కార్డ్ పేమెంట్లను రిపోర్టు చేయడం :
కొత్త ఆదాయపు పన్ను ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ బిల్లుకు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ చెల్లిస్తే ఈ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేయాలి.
అదేవిధంగా, రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం బిల్లు పేమెంట్ క్యాష్ కాకుండా వేరే ఏ విధంగానైనా జరిగితే బ్యాంక్ లేదా కార్డ్ జారీ చేసే సంస్థ ఆర్థిక లావాదేవీల ప్రకటన (SFT)లో రిపోర్టు చేస్తుంది. ఈ నియమం గతంలోనే ఉంది. కానీ, కొత్త ముసాయిదాలో స్పష్టంగా చేర్చింది.
క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అడ్రస్ ప్రూఫ్ :
ముసాయిదా నియమాల ప్రకారం.. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఇకపై అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు. అయితే ఆ స్టేట్‌మెంట్ 3 నెలల కన్నా పాతది కాకూడదు. అంటే.. పాన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్‌గా వ్యాలీడ్ అవుతుంది.
పన్ను చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు వాడటం :
ప్రతిపాదిత నియమాల ప్రకారం.. పన్ను చెల్లింపుల కోసం ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్ల జాబితాలో క్రెడిట్ కార్డులు కూడా చేరాయి. అంటే, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ మాదిరిగా క్రెడిట్ కార్డులను కూడా పన్నులు చెల్లించేందుకు ఉపయోగించవచ్చు.
కంపెనీ జారీ చేసిన క్రెడిట్ కార్డులపై పన్ను ఎలా? :
ఒక ఉద్యోగికి కంపెనీ క్రెడిట్ కార్డ్ ఇచ్చినా లేదా వారి వ్యక్తిగత క్రెడిట్ కార్డుతో చేసిన ఖర్చులను తిరిగి చెల్లిస్తే పన్ను విధిస్తారు. అయితే, ఖర్చు అధికారిక ప్రయోజనాల కోసం మాత్రమే అయితే పన్ను విధించరు.
ఇందుకోసం కంపెనీ ఖర్చు, తేదీ, ఉద్దేశ్యంతో సహా ఖర్చు పూర్తి రికార్డును తెలియజేయాలి. ఖర్చు అధికారిక ప్రయోజనాల కోసం మాత్రమే అని కూడా ధృవీకరించాలి. ఇందులో సభ్యత్వ రుసుములు, వార్షిక రుసుములు ఉంటాయి.
క్రెడిట్ కార్డుకు పాన్ అవసరం :
ఏదైనా బ్యాంకు లేదా కార్డు జారీ చేసే సంస్థ నుంచి క్రెడిట్ కార్డు పొందేందుకు పర్మినెంట్ కార్డు (పాన్) అందించడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను నియమాలు 2026 ముసాయిదా ప్రతిపాదిస్తుంది. క్రెడిట్ కార్డు లావాదేవీలను పన్ను వ్యవస్థతో లింక్ చేసేందుకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
కొత్త నిబంధనలేంటి? :
ఈ ప్రతిపాదనలు పెద్ద మొత్తంలో లావాదేవీలను మానిటరింగ్ చేయడం, డాక్యుమెంటేషన్‌ను సులభతరం చేయడం, పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే లక్ష్యం. ఈ నియమాలు అమల్లోకి వస్తే క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ పేమెంట్ రికార్డులు, వినియోగం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

