Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

ICICI Minimum Balance : కస్టమర్లకు గుడ్ న్యూస్.. ICICI బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ రూ. 15వేలు ఉంటే చాలు..!

ICICI Minimum Balance Rule

ICICI Minimum Balance Rule

ICICI Minimum Balance : ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI కనీస బ్యాలెన్స్ నిబంధనలలో అతిపెద్ద మార్పును ప్రకటించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో కొత్త అకౌంట్లను ఓపెన్ చేసే కస్టమర్లకు రూ. 50,000 కనీస బ్యాలెన్స్ నిబంధనను బ్యాంక్ రద్దు చేసింది. ఇప్పుడు ఈ కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ రూ. 15,000గా నిర్ణయించింది.

ICICI Minimum Balance : కస్టమర్ల అభిప్రాయంతో మార్పు :

అదేవిధంగా, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ వరుసగా రూ. 7,500 నుంచి రూ. 2,500గా నిర్ణయించింది. గత వారం బ్యాంక్ కనీస సగటు నెలవారీ బ్యాలెన్స్‌ను రూ. 10,000 నుంచి రూ.50,000కి పెంచాలని నిర్ణయించింది.

Read Also : Personal Loan : పర్సనల్ లోన్ కావాలా? ఈ 10 బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్లు పొందొచ్చు.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

Advertisement

అయితే, కస్టమర్, ఇండస్ట్రీల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ మార్పు వచ్చింది. చాలా మంది కస్టమర్లు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సవరణ శాలరీ అకౌంట్లు, సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్లు, జన్ ధన్ ఖాతాలు, ప్రత్యేక అవసరాల ఖాతాలకు వర్తించదని బ్యాంక్ స్పష్టం చేసింది.

ICICI Minimum Balance : ఎవరికి మినహాయింపు ఉందంటే? :

దీనితో పాటు, 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు, 1,200 ఎంపిక చేసిన సంస్థల విద్యార్థులకు కనీస బ్యాలెన్స్ షరతు నుంచి మినహాయింపు ఉంటుంది. కనీస బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ పడుతుంది.

కొత్త నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన బ్యాలెన్స్‌ లేని ఖాతాలకు 6శాతం లేదా రూ. 500 (ఏది తక్కువైతే అది) జరిమానా విధిస్తుంది. కస్టమర్ అంచనాలు, ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా ఈ మార్పులు చేసినట్లు ICICI బ్యాంక్ తెలిపింది.

Advertisement
Exit mobile version