Virata Parvam Movie Review : ‘విరాట పర్వం’ మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాకు ఇదే హైలెట్..!

Virata Parvam Movie Review : దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం (Virata Parvam Movie Review) మూవీ జూన్ 17,2022న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీలో సాయి పల్లవి నటన ఎంతో ఆకట్టుకుంది. రవన్న పాత్రలో రానా కూడా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాదు.. క్రిటిక్స్ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ విరాట పర్వం మూవీ రివ్యూను ఓసారి పరిశీలిస్తే.. సినిమా ఏ స్థాయిలో మెప్పించిందో చూద్దాం..

Virata Parvam Movie Review And Rating with Live Updates

అదో ఖమ్మం జిల్లాలోని ఒక కుగ్రామం.. అక్కడ నక్సలైట్ల ప్రాభల్యం అధికంగా ఉండే ప్రాంతం.. అదే ప్రాంతంలో వెన్నెల (సాయి పల్లవి)తో విరాట పర్వం మూవీ బిగిన్ అవుతుంది. వెన్నెల కుటుంబం కమ్యూనిస్టు సిద్ధాంతాలతో నడిచేది. అదే ఆమెలోనూ పెరిగిపోయింది. చిన్నప్పటి నుంచి అదే భావాజాలంతో పెరిగి పెద్దయింది. ఆ తర్వాత తాను కూడా అందులో చేరాలని భావిస్తుంది. డాక్టర్ రవి (రాణా దగ్గుబాటి) వరంగల్‌లోని ఒక చిన్న గ్రామంలో నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేస్తుంటాడు. తనలోనూ కమ్యూనిజం భావజాలం ఉండటంతో ఒకవైపు వైద్యుడిగా సేవలందిస్తూనే మరోవైపు.. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాడు.

Advertisement

ఆ క్రమంలోనే రవి (రవన్న) నక్సలైట్‌గా మారిపోతాడు. తనకు కవితలను అద్భుతంగా రాయగలడు. అరణ్య అనే పేరుతో మంచి కవిత్వాన్ని రాస్తాడు. అలా తన కవితలను ప్రజలకు చేరవేశాడు. అలా వెన్నెల రవన్న కవితలను చదివి అతడితో ప్రేమలో పడుతుంది. నక్సలైట్ల తిరుగుబాటు నడుస్తున్న సమయంలో రవన్నను కలిసేందుకు వెన్నెల వెళ్తుంది. అలా వారిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా సాగుతుంది.. వెన్నెలను రవన్న ప్రేమిస్తాడా? అసలు రవి నక్సలైటుగా మారడానికి మెయిన్ రీజన్ ఏంటి.. ఇంతకీ రవన్నను వెన్నెల కలుసుకోగలదా? వారి ప్రేమ ఫలిస్తుందా? అనేది తెలియాలంటే విరాట పర్వం మూవీ తప్పక చూడాల్సిందే..

నటీనటులు :
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, రచయిత, దర్శకుడు వేణు ఊడుగుల, సినిమాటోగ్రఫీ డాని సలో, దివాకర్ మణి, సంగీతం సురేష్ బొబ్బిలి, నిర్మాత సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్..

Advertisement

Virata Parvam Movie Review :  విరాట పర్వం ఎలా ఉందంటే?

విరాట పర్వం.. అద్భుతంగా వచ్చింది. నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. విరాట పర్వం మూవీ కథ కొత్తగా ఉంటుంది. ఇందులో వెన్నెల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో వెన్నెల పాత్ర నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. వెన్నెల (సాయి పల్లవి) నటనను చూశాక ఎవరైనా హ్యాట్సాప్ అనకుండా ఉండలేరు. వెన్నెల ఎవరు.. ఆమె ఎవరి కోసం నక్సలైట్ గా మారుతుంది.. ఇలా మొత్తం మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు మూవీలోని కథను ఆసక్తికరంగా అందించాడు. ఫస్ట్ మూవీలో అప్పుడే అయిపోయిందా? అనిపించక మానదు.. ప్రతి సీన్ స్టోరీని బాగా ఎలివేట్ చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌కు బ్యాక్ బోన్ అని చెప్పాలి. అంత అద్భుతంగా వచ్చింది విరాట పర్వం మూవీ. రానా కెరీర్‌లో అద్భుతమైన మూవీగా నిలుస్తుంది.

Virata Parvam Movie Review And Rating with Live Updates

ఫస్ట్ హాప్ మొత్తంలో వెన్నెల చుట్టే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఫుల్ ఎమోషనల్ సన్నివేశాలతో నడుస్తుంది. సామాజిక సమస్యలపై క్లైమాక్స్‌లో భావోద్వేగాలు పండించారు. దాంతో మూవీ అద్భుతంగా వచ్చింది. రవి పాత్రలో రానా చక్కగా నటించాడు. ఇలాంటి రోల్ రానా గతంలో ఎన్నడూ చేయలేదు. రవి పాత్రలో అనేక షేడ్స్ చూపించారు. రానా ఎమోషనల్ సీన్లలో తనదైన నటనతో మెప్పించాడు. సిల్వర్ స్ర్కీన్‌పై ప్రతి ఎమోషన్‌ చక్కగా పలికించాడు రానా. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. వెన్నెల లేనిదే విరాట పర్వం లేదంటే అతిశయోక్తి కాదు. రానా, సాయిపల్లవి పాత్రలతో పాటు భరతక్కగా ప్రియమణి అద్భుతంగా నటించింది. తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసిందనే చెప్పాలి. అలాగే నవీన్ చంద్ర కూడా పాత్ర మేరకు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

Advertisement

దర్శకుడు వేణు ఊడుగుల విరాట పర్వంతో తనలోని విజన్ అద్భుతంగా తెరకెక్కించాడు. విరాట పర్వం మూవీలో డైలాగ్‌లు ఎమోషనల్‌ చేస్తాయి. చాలా సీన్లలో ఎమోషనల్ బాగా పండింది. థియేటర్లలోని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడిగా వేణు ఊడుగుల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టెక్నికల్ పరంగా విరాట పర్వం బాగా వచ్చింది. సురేశ్ బొబ్బిలి అద్భుతమైన పాటలను అందించారు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. విరాట పర్వం మూవీని ఫ్యామిలీతో కలిసి చూడగల సినిమా.. అంతేకాదు.. కాస్తా ఎమోషనల్ అయ్యేవారికి ఈ మూవీని చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం కష్టమే.. అంతగా ఎమోషనల్ చేస్తుంది. ప్రేక్షకుడు ఎవరైనా ఒక మంచి సినిమా చూసామనే భావన తప్పక కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు..

Advertisement

రివ్యూ : విరాట పర్వం
సినిమా రేటింగ్: 3.5/5

Read Also : Virata Parvam First Review : ‘విరాట ప‌ర్వం’ ఫ‌స్ట్ రివ్యూ వచ్చేసింది..!

Advertisement
Tufan9 Telugu News

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.