Viral news : స్వయంగా తనో ప్రజాప్రతినిధి. ఆయన కారులో ఓ డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. మృతుడు ఆ ప్రజాప్రధి కారు డ్రైవరే. అసలు ఏం జరిగిందంటే.. కాకినాడలో ఓ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఉండటం కలకలం రేపింది. కాకినాడ జిల్లా 2 టౌన్ పరిధిలోని వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంత బాబు కారులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
చనిపోయిన వ్యక్తి సుబ్రహ్మణ్యం. గతంలో ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద డ్రైవర్గా పని చేసే వాడు. తీరా అదే కారులో శవమై కనిపించాడు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి సుబ్రహ్మణ్యాన్ని కారులోనే ఇంటి నుండి బయటికి తీసుకెళ్లాడని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు చెబుతున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో సుబ్రహ్మణ్యం టిఫిన్ కోసం బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. డెడ్ బాడీని ఇంటికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పారని వారు వెల్లడించారు.
సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని తీసుకువచ్చిన అనంతబాబును కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో కారు వదిలి పరారయ్యాడని వాళ్లు చెప్పారు. యువకుడు కాళ్లు, చేతులు విరిచి మట్టిలో దొర్లించి కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కుమారుడిని చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతరబాబుపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటికి వచ్చి తీసుకపోయి శవంగా తిరిగి తీసుకువచ్చారని కన్నీరు మున్నీరవుతున్నారు. హంతకులపై చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.