మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 10 సినిమాలు ఆగిపోయాయి.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవితో వినాలని ఉంది మూవీ మొదలైంది. టబు, ఊర్మిళ హీరోయిన్లు, సగం షూట్ అయ్యాక ఆగిపోయింది.
బాగ్ధాద్ గజదొంగ:
సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘అబూ బాగ్దాద్ గజదొంగ’ మూవీ ప్రారంభమైంది. కానీ, మధ్యలోనే ఆగిపోయింది.
వజ్రాల దొంగ:దర్శకుడు కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవితో శ్రీదేవి హీరోయిన్‌గా ‘వజ్రాల దొంగ’ మూవీ మొదలైంది. ఈ సినిమాను శ్రీదేవి తీద్దామనుకున్నారు. ఇది కూడా ఆగిపోయింది.
ఇద్దరు పెళ్లాల కథ :
కోదండరామి రెడ్డి దర్శకత్వంలో ఇద్దరు పెళ్లాల కథ చిరంజీవితో సినిమా అనుకున్నారు. దివ్యభారతితో మరో హీరోయిన్, స్క్రిప్ట్ ఫైనలైజ్ కాకపోవడంతో ఆపేశారు.
విఎన్ ఆదిత్య :దర్శకుడు విఎన్ ఆదిత్యతో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. తర్వాత ఆ స్టోరీ కుదరక ఆగిపోయింది.
భూలోక వీరుడు :
సింగీతం శ్రీనివాసరావు.. చిరంజీవితో భూలోక వీరుడు అంటూ జానపద చిత్రాన్ని తీద్దామనుకున్నారు. సినిమా మొదలయ్యాక వెంటనే ఆగిపోయింది.
ఆంధ్రావాలా :జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ తెరకెక్కించిన ఆంధ్రావాలా మూవీ ముందు చిరంజీవితోనే చేయాల్సింది. కానీ, మూవీని చిరు రిజెక్ట్ చేశాడు
ఆటోజానీ :
చిరంజీవి 150వ మూవీగా ఆటోజానీని చేయాల్సింది.. పూరీ దర్శకత్వంలో నిర్మాత రామ్ చరణ్. ఇది ఆగిపోయింది.
శాంతి నివాసం :
చిరంజీవి హీరోగా శాంతి నివాసం ఫ్యామిలీ మూవీ అనుకున్నారు. ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది.
వడ్డీ కాసుల వాడు :
చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ముందు వడ్డీ కాసుల వాడు మూవీ చేద్దామనుకున్నారు. కానీ, ఎందుకో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.