Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu: రిషి ఫై మండిపడ్డ వసుధార.. జగతి ఏం చేయనుంది..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Guppedantha Manasu : భయంతో వణికిపోతున్న శైలేంద్ర…ముకుల్‌ ముందు నిజం చెప్పిన ధరణి!

రిషి, పుష్ప ను పిలిచి ఈరోజు నేను రావడం లేదు వసుధార అని క్లాస్ తీసుకోమని చెప్పు అని చెబుతాడు. ఆ విషయం పుష్ప వసు కి చెప్పగా, అప్పుడు వసుధార ఈరోజు నేను క్లాస్ తీసుకోబోతున్నారు అని తన తోటి స్టూడెంట్స్ కి చెప్పగా అందరూ క్లాప్స్ కొడతారు. మరొకవైపు రిషి కాలేజీ స్టాఫ్ మహేంద్ర లో అడిగిన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

ఇంతలో అక్కడికి జగతి రాగా అప్పుడు రిషి జగతిని ఏమీ అనలేక లైబ్రేరియన్ పై విరుచుకు పడతాడు. లైబ్రేరియన్ కోప్పడుతూ ఎందుకు అనవసరమైన విషయాలలో తలదూరున్నారు అంటూ ఇండైరెక్టుగా జగతిని తిడతాడు. ఆ మాటలు ఎవరి గురించి రిషి అన్నాడో గ్రహించిన జగతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇంతలో వసుధార,రిషి లు ఒకరికొకరు ఎదురుగా అనుకోకుండా తగులుతారు.

Guppedantha Manasu ఫిబ్రవరి 2 ఎపిసోడ్ : రిషికి నిజం చెప్పాలి అనుకున్న చక్రపాణి.. కొత్త ప్లాన్ వేసిన దేవయాని?

అప్పుడు వసు చేతిలో ఉన్న ఫోటోలు కింద పడిపోతాయి. ఆ ఫోటోలు షార్ట్ ఫిలిం సమయంలో ఇద్దరూ కలిసి ఉన్నవి. ఆ ఫోటోలను చూసిన రిషి ఈ ఫోటోలు ఎవరు తీశారు అంటూ వసు ఫై మండి పడతాడు. మరొక వైపు మిషన్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిలిమ్ సక్సెస్ అయినందుకు గాను జగతిరిషి ని పొగుడుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే కాలేజీ స్టాప్ మీ పెంపకం మీ క్రమశిక్షణ రిషి సార్ కు రాకుండా ఉంటాయా అని అనగా అప్పుడు జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ మాటలు విన్న రిషి కోపంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు వసు వాళ్ళు ఏదో అనుకుంటే మీరు ఎందుకు ఇలా డిస్టబ్ అవుతున్నారు సార్ అని అడగగా,అప్పుడు రిషి వసు ఫై ఫైర్ అవుతాడు. అనంతరం రిషి తన మనసులోని మాటలను జగతికి లెటర్ లో రాస్తాడు.

Advertisement
Guppedantha Manasu ఫిబ్రవరి 01 ఎపిసోడ్ : రిషిని చూసి బాధపడుతున్న జగతి.. దగ్గరవుతున్న వసు రిషి?

వసు ని పిలిచి ఈ లెటర్ జగతి మేడం కి ఇవ్వు అని అనగా అప్పుడు వసు నేను ఇవ్వను సార్ మీరే వెళ్ళి ఇచ్చుకోండి అని అనగా చెప్పింది చెయ్యి అని అరుస్తాడు రిషి. ఇక ఆ లెటర్ చదివిన జగతి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు వసు కు ఏమీ అర్థం కాక ఆ లెటర్ చదివిగా ఏంటి సార్ ఇది ఇప్పుడు మీ మనసులో ఏమి ఉందో స్పష్టంగా తెలుస్తోంది అంటూ కోపం తో రగిలి పోతుంది వసు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Exit mobile version