Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Intinti Gruhalakshmi: తులసిని అవమానించిన దివ్య.. తల్లిని తలచుకొని బాధపడుతున్న ప్రేమ్..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రేమ్, శృతి లు ఇంటికి కావలసిన సరుకులు తీసుకొని మిగిలిన డబ్బులు పొదుపు చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు రాములమ్మ సైలెంట్ గా ఉండగా తులసి ఏం జరిగింది రాములమ్మ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు రాములమ్మ అబద్ధం చెప్పి ఇంటికి 3000 రెంట్ కట్టాలి అని అడుగుతుంది. అప్పుడు తులసి డబ్బులు తెచ్చి ఇస్తుంది. అప్పుడు రాములమ్మ మీకు తెలియకుండానే మీరు మీ కొడుకు సహాయం చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది.

Advertisement

మరోవైపు ప్రేమ్ సరుకులు తీసుకుని రావడానికి వెళ్లి శృతి కోసం చీరలను కొనుక్కొని వస్తాడు. అప్పుడు శృతి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చీరలు ఎందుకు తెచ్చావు అంటూ ప్రేమ్ ఫై కో పడుతుంది. ఇక శృతి కూడా తన దగ్గర ఉన్న మూడు వేల రూపాయలతో ప్రేమ్ కొత్తబట్టలు తీసుకుంటుంది. అప్పుడు ప్రేమ్, శృతి నీ సెలక్షన్ సూపర్ గా ఉంది అంటూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో ప్రేమ్ అత్తయ్య మాధవి కూరగాయలు తీసుకొని వస్తుంది.

నీకోసం ఇంట్లో అందరూ బెంగ పెట్టుకున్నారు అని చెబుతుంది. ఇంతలో ప్రేమ్ కి, దివ్య కాల్ చేసి తన భాగం మొత్తం చెబుతుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నయ్య, తిండి తిప్పలు లేకుండా ఉంటున్నాను అని చెబుతుంది. అప్పుడు ప్రేమ నువ్వు అన్నం తినకపోతే నా మీద ఒట్టు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక ప్రేమతో మాట్లాడాను అన్న సంతోషంతో దివ్య వెళ్లి భోజనం చేస్తూ ఉంటుంది.

రాములమ్మ తులసి గురించి గొప్పగా చెబుతుండగా అప్పుడు దివ్య మాటలు ఆపి ఫస్ట్ అన్నం పెట్టు రాములమ్మ అని అసలు ఉంటుంది. ఈ క్రమంలోనే తులసి మనసు నొచ్చుకునే విధంగా దివ్య మాట్లాడుతుంది. ఇక దివ్య అన్న మాటలకు తులసి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ తన తల్లిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు.

Advertisement

ఆకాశంలో నక్షత్రాలు లేవు పక్కన మా అమ్మ కూడా లేదు అంటూ ఫీల్ అవుతూ ఉంటాడు. మరో వైపు తులసి నా కొడుకు పరిస్థితి తెలిసి కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితి అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Exit mobile version