Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu: సృహ తప్పి పడిపోయిన మహేంద్రవర్మ.. కన్నీటితో జగతి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్ గీసిన వసుధార చిత్రాన్ని చూసుకుంటూ.. తన లవ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు రిషి టీ స్టాల్ దగ్గర వసు, లెటర్ రాసిన వ్యక్తిని పొగిడిన మాటలు గురించి ఆలోచించుకుంటూ.. మనసులో తెగ మురిసిపోతూ ఉంటాడు.

ఆ తర్వాత రిషి ఓ సాంగ్ ను గట్టిగా పాడుతాడు. అది విన్న గౌతమ్ బయట ఎవరికి ఏమైందో అని బయటికి వచ్చి చూస్తాడు. ఆ పాటను అదే పనిగా కళ్ళు మూసుకొని పాడుతున్న రిషిను గౌతమ్ చూసి నవ్వుకుంటాడు. ఈలోపు వసుధార మహేంద్రకు కాల్ చేసి రిషి సర్ నా కాల్ ఆన్సర్ చేయడం లేదు.. కాస్త ఏమైందో తెలుసుకోండి సర్ అనగా..

New Ration Card : కొత్త రేషన్‌ కార్డుదారులకు పండగే.. సెప్టెంబర్ 1 నుంచి నెలవారీ సన్న బియ్యం తీసుకోవచ్చు..!

మహేంద్ర రిషి దగ్గరకు వస్తాడు. ఇక రిషి ఆ పాటను అలానే పాడుతుండగా మహేంద్ర తెగ నవ్వుకుంటాడు. ఆటు ఫోన్ లో ఆన్ కాల్ లో ఉన్న వసు కూడా రిషి వాయిస్ గుర్తుపట్టి నవ్వుకుంటుంది. ఆ తర్వాత
ఫోన్ చూసుకున్న రిషి మనసులో ‘ఈ పొగరు ఫోన్ చేసింది ఎందుకయ్ ఉంటుంది’. అని మనసులో అనుకొని వసుకు కాల్ బ్యాక్ చేస్తాడు.

Advertisement

రిషి ఫోన్ వసు లేపకపోగా రిషి ఇరిటేట్ అవుతాడు. మరోవైపు గౌతమ్ దేవయాని దగ్గరకు వచ్చి కాలేజీకి త్వరగా వెళ్లిన రిషి గురించి ఇలా అడుగుతాడు. ‘పెద్దమ్మ.. వీడేంటి ఈ రోజు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు’ అని దేవయానిని అడుగుతాడు. అదే నాకు అర్థం కావడం లేదు వేలా.. పాల లేకుండా తిరుగు తున్నాడు అని దేవయాని అంటుంది.

Business Idea : మీ జాబ్‌కు గుడ్‌బై చెప్పేయండి.. ఈ 5 బిజినెస్‌లతో కోట్లు సంపాదించుకోవచ్చు.. తక్కువ పెట్టుబడితో కోట్ల ఆదాయం..!

ఈలోపు అది విన్న మహేంద్ర ‘వేలా..పాలా లేకుండా కష్టపడుతున్నాడు కాబట్టే కాలేజీకి అంత పెద్ద పేరు వచ్చింది వదినా’ అంటూ తన కొడుకును వెనకేసుకు వస్తాడు. అలా కొన్ని మాటలతో మహేంద్ర, దేవయానికి బుద్ధి చెబుతాడు. ఆ మాటలు జీర్ణించుకోలేని దేవయాని గౌతమ్ ముందు నన్ను ఏ మాట పడితే ఆ మాట ఆ మాట అనేస్తావా.. అని కోపంతో అంటుంది.

దానికి మహేంద్ర ‘అయ్యో వదినా.. మీరు అలా అనుకున్నారా. నన్ను క్షమించండి అంటూ వెటకారంగా అంటాడు. ఆ తరువాత జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటూ ఉండగా మహేంద్ర సృహ తప్పి పడిపోతాడు. వెంటనే అతనిని హాస్పిటల్ కి తరలిస్తారు. ఈ క్రమంలో జగతి చాలా బాగా ఏడుస్తుంది.

Advertisement
Thammudu Movie Review : తమ్ముడు మూవీ రివ్యూ.. అక్క ఆశయం కోసం తమ్ముడి పోరాటం.. నితిన్ ఖాతాలో హిట్ పడినట్టేనా?
Exit mobile version