Shocking Video : వామ్మో.. పెద్ద మొసలి.. చూస్తునే గజగజ వణికిపోతాం.. అలాంటిది ఓ వ్యక్తి ఆ మొసలితోనే సయ్యాటలాడుతున్నాడు. ఏకంగా మొసలిని కౌగలించుకున్నాడు. అదే మొసలి నీళ్లలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని అంటారు. నీళ్లలో మొసలిని తప్పించుకోవడం కష్టమే.. కానీ, నేలపై మొసలితో ఈ వ్యక్తి ఎలా పోరాడుతున్నాడో చూడండి.. షాకింగ్ వీడియో చూస్తే అలానే ఉంది కదా.. కానీ, ఈ వీడియోలో వ్యక్తి మొసలితో సరదాగా ఆడుకుంటున్నాడు.
పైగా భారీ ఎలిగేటర్ ఆ వ్యక్తిని తన వాడైయిన కాలివేళ్లతో పట్టేసుకుని ముద్దాడుతోంది. చూడటానికి భయానకంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓసారి పరీక్షగా మొసలిని గమనిస్తే.. ఆ మొసలి నోటికి టేప్ వేసి ఉంది. ఎందుకంటే.. ఎంత మచ్చిగా చేసుకున్న మొసలి వేటాడటం అలవాటు.
అలాంటి మొసలితో ఇలాంటి సరదా గేమ్స్ ఆడితే ప్రాణాలకే ప్రమాదం.. కొన్నిసార్లు మొసలి వంటి జంతువులతో చేసే సరదా స్టంట్స్ బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏదిఏమైనా ఈ షాకింగ్ వీడియోను అందరిని ఆకట్టుకుంటోంది. మీరు కూడా చూసేయండి వీడియో..
Read Also : Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్క ఎపిసోడ్ కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలుసా?